Stress | ఇలా చేస్తే మీ ఒత్తిడి చిటికెలో మాయమైపోతుంది
Visualization | ఒంటరిగా ఉన్న వేళ ఒత్తిడికి గురవుతున్నారా? మనసు ఆందోళనకరంగా మారుతున్నదా? అయితే ఒక్క నిమిషం పాటు కళ్లు మూసుకొని.. మీ మనోనేత్రాన్ని తెరవండి. కొన్ని వస్తువులను, పరిసరాలను మీకు నచ్చినట్లుగా ఊహించుకోండి. మనం చూసే చూపు, ఊహించుకునే విధానం ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంతోపాటు సుఖంగా నిద్రపోవడానికి ఉపకరిస్తుందని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు.
మనిషికి మాత్రమే ఉన్న అద్భుతమైన శక్తి ఊహ. మనం భౌతికంగా చేయలేని ఎన్నో పనులు ఊహల్లో చిటికెలో జరిగిపోతుంటాయి. ఈ ఊహాజనితమైన ఆలోచనలు మిమ్మల్ని ఒత్తిడి, ఆందోళనల నుంచి ఇట్టే బయటపడేస్తాయని హామీ ఇస్తున్నారు నిపుణులు. ఒంటరిగా ఫీలవుతున్నప్పుడు ఊహల ఊయల ఊగమని చెబుతున్నారు.
♦ మనసు బాగోలేనప్పుడు తేలికైన రంగులను ఊహించుకోండి. మీ కంటికి నచ్చిన లేత రంగులతో పెయింట్ వేస్తున్నట్లు భావించండి. ఆకుపచ్చ, నీలం, తెలుపు వంటి రంగులు పాత ఆలోచనల నుంచి విశ్రాంతిని ఇస్తాయట.
♦ పాత ఆలోచనల్లో పడి పరధ్యానంలో మునిగిపోయేవారు మీ దగ్గరున్న ఏదైనా వస్తువుతో కొత్తగా ఏం చేయవచ్చో ఊహించుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. పరధ్యానాన్ని పారదోలడానికి ఏదో ఒకటి చెయ్యండి. ఉన్నచోట మాత్రం అలాగే ఉండకూడదు.
♦ ప్రకృతి, పచ్చదనం మనిషికి ఎప్పటికీ హాయినిస్తాయి.సూర్యోదయం వేళ ఉద్యానవనంలో విహరిస్తున్నట్టుగా ఊహించుకోండి. గాలి స్పర్శను అనుభూతి చెందుతున్నట్లుగా, పూల వాసన చూస్తున్నట్టు.. ఇలా మనసు కోటలో విహరించండి
♦ ధవళవర్ణపు సూర్యకాంతిని ప్రాణవాయువుగా పీల్చుకుంటున్నట్లు ఊహించుకోండి. ఈ సమయంలో ప్రతి ఉచ్ఛాస శరీరానికి వేడినిస్తుంది. ఇలా పది నుంచి ఇరవై శ్వాసలు ఆగకుండా తీసుకోండి. శ్వాస ఎక్కువగా తీసుకుంటూ, తక్కువగా వదులుతూ ఉండాలి. దీంతో శరీరంపై మనసు లగ్నమవుతుంది. పాత ఆలోచనల నుంచి బయటపడతారు. అడపాదడపా ఇలా ఊహల్లో తేలిపోవడం వల్ల ఒత్తిడిని జయించవచ్చు అని నమ్మకంగా చెబుతున్నారు మనస్తత్వ శాస్త్రజ్ఞులు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

