బాస్‌తో వేగలేకపోతున్నారా? అతన్ని ఎలా మెప్పించాలో తెలియట్లేదా? ఈ టిప్స్ మీకోసమే!!
Manage Your Boss | బాస్ మనసు గెలవాలంటే, ముందు బాస్‌ను అర్థం చేసుకోవాలి. ఆ మేనేజర్ స్థాయి వ్యక్తి సాధారణ ఉద్యోగులమైన మన నుంచి ఏం ఆశిస్తున్నాడన్నది గ్రహించాలి.
How to Manage Your Boss | కంపెనీ యజమానికి సవాలక్ష పనులు. మేనేజింగ్ డైరెక్టర్ కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో బిజీ. సీయీవోకు సామాన్య ఉద్యోగులను పట్టించుకునే తీరిక ఉండదు. వాళ్లందరి ప్రతినిధే.. మేనేజర్! ఆ తక్షణ బాసును మెప్పించినంత కాలం.. ఉద్యోగానికి ఢోకా ఉండదు. ప్రమోషన్లకు కొరత ఉండదు. ఇంక్రిమెంట్లు పిప్పరమెంట్లే. కానీ, అదంత సులభం కాదు. మనకంటూ ఓ స్ట్రాటజీ ఉండాలి.
బాసు పనిమంతుడు కాకపోవచ్చు. టెక్నాలజీలో ఏబీసీడీలు కూడా తెలియకపోవచ్చు. ఇంగ్లిష్ కాపీ పరమచెత్తగా ఉండవచ్చు. గత చరిత్ర కూడా ఏమంత గొప్పగా లేకపోవచ్చు. అయినా సరే.. బాస్ ఈజ్ బాస్. అతడిని మామూలు మనిషిలా చూడకండి. అతని కోపాన్ని తేలిగ్గా తీసుకోకండి. దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించినట్టే..
యజమాని ప్రతి విభాగంలో రివాల్వింగ్ చెయిర్ వేసుకుని కూర్చోలేడు కాబట్టి, తన ప్రతినిధిగా బాసును పంపాడు.
బాస్ మనసు గెలవాలంటే, ముందు బాస్‌ను అర్థం చేసుకోవాలి. ఆ మేనేజర్ స్థాయి వ్యక్తి సాధారణ ఉద్యోగులమైన మన నుంచి ఏం ఆశిస్తున్నాడన్నది గ్రహించాలి. ఆ మేరకు మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఉత్తమ ఫలితాలు అందించాలి. ప్రతి బాస్‌కూ ఓ క్వశ్చనీర్ ఉంటుంది. ప్రతి మీటింగ్‌లో అవే ప్రశ్నల్ని తిప్పితిప్పి అడుగుతుంటాడు. వాటికి జవాబులు సిద్ధం చేసుకోవాలి. ఫలానా విషయంలో మనకు తనకంటే కించిత్ ఎక్కువే తెలుసు.. అన్న అభిప్రాయం సృష్టించగలిగితే చాలు. తిరుగే ఉండదు. ఆ సర్టిఫికెట్ అంత సులభంగా రాదు. హోమ్‌వర్క్ చేయాలి. అప్డేట్ కావాలి.

నువ్వు ఎంత తోపు అయినా సరే, బాస్‌కు నచ్చని పని చేయొద్దు. బాస్ పంక్చువాలిటీని ప్రేమించేవాడైతే .. సకాలంలో ఆఫీసుకు వెళ్లు. బాస్‌కు ఎటికెట్ మీద మక్కువ ఎక్కువైతే.. ఫార్మల్గా డ్రస్ చేసుకో. బాస్‌కు గాసిప్స్ అంటే పడవని తెలిస్తే.. కొలీగ్స్‌తో ముచ్చట్లు తగ్గించుకో. అదే సమయంలో.. బాస్ ఇష్టాలను తెలుసుకో. సినిమా ప్రియుడైతే.. ఆ సబ్జెక్టు మీద పట్టు సాధించు. రాజకీయాలను ఫాలో అవుతుంటే.. కరెంట్ ఎఫైర్స్‌పై కసరత్తు ప్రారంభించు. ఈ రెండు కేటగిరీలకూ చెందనివాడైతే.. గమ్మున నీ పని నువ్వు చేసుకో!
‘బాసో భిన్న రుచిః’ ఒక్కొక్కరిది ఒక్కో టైపు. కొందరు, చెప్పినపని చేస్తే చాలనుకుంటారు. కొందరు, చెప్పనిపని కూడా చెయ్యాలనుకుంటారు. కొందరు ఏమీ చెప్పరు, కానీ అన్నీ చేసిపెట్టే సబార్డినేట్స్‌ను ఇష్టపడతారు. ఇన్ఫార్మల్గా వాట్సాప్‌లో మెసేజ్ పెట్టినా స్పందించేవాళ్లు కొందరు. పక్కాగా రిపోర్టు రూపంలో సమర్పిస్తేనే సంతృప్తి చెందేవాళ్లు ఇంకొందరు. అతని మార్గంలో మీరు వెళ్లాలి తప్పిస్తే, మీ దార్లోకి అతను రాడు. మార్పును స్వీకరించండి. బాసును మెప్పించండి.
పని విషయంలో మీ బలాలను బేరీజు వేసుకోండి. బాసు బలహీనతలనూ గమనించండి. బాసు బలహీనంగా ఉన్న ఏరియాలో.. మీ బలాన్ని పెంచుకోండి. తనకులేని నైపుణ్యం ఉన్నవారినే ఏ బాసు అయినా ఇష్టపడతాడు. తనకు పట్టు ఉన్న రంగంలో మరొకరు వేలుపెడితే తట్టుకోలేడు.
ఆఫీస్ పాలిటిక్స్ ఎలా ఉన్నా.. అంతిమంగా బాసు పనిమంతులనే ఇష్టపడతాడు. కష్టపడేవాళ్లతోనే మరింత చాకిరీ చేయిస్తాడు. అతని దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నంలో ప్రతిదానికీ గంగిరెద్దులా తల ఊపొద్దు. మోయలేనంత భారాన్ని నెత్తిన వేసుకోవద్దు. సున్నితంగానే అయినా ‘నో..’ చెప్పండి. లేదంటే, పెండింగ్ ప్రాజెక్టుల లిస్టు చేతిలో పెట్టి.. ముందుగా ఏ పని చేయాలో అడగండి. ఆ మాత్రం క్లారిటీ ఉండాల్సిందే.
నూటికి తొంభైతొమ్మిది శాతం బాసుల్ని సులభంగానో, కొంత కష్టంగానో మేనేజ్ చేయవచ్చు. కానీ ఒక్కశాతం మాత్రం, ఒంటికొమ్ము రాక్షసులే. వాళ్ల కారణంగానే గుండెపోట్లు వస్తాయి, బీపీ రేట్లు పెరుగుతాయి. ఆ పరిస్థితే వస్తే.. కొలువు కోసం ఆరోగ్యాన్ని కుళ్లబొడుచుకోవాల్సిన పన్లేదు. వీలైతే సెక్షన్ మారండి. తప్పనిసరైతే ఉద్యోగం మారండి. అసలు బాస్ అనే
క్యారెక్టరే లేని కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోండి. విష్ యూ గుడ్ లక్!
Read More :
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
Tusshar Kapoor | రూ.5 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం.. మరో బాలీవుడ్ నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..!
Abdulla Shahid: చిన్నారిపై లైంగిక వేధింపులు.. మాల్దీవులు మాజీ విదేశాంగ మంత్రి అరెస్టు
AP News | తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా.. మూడు వార్డుల్లోనే వైసీపీ ఆధిక్యం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

