Personality Development Tips | ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా అతిగా ఆలోచిస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
Personality Development Tips 1 | ఆలోచనల్లో స్పష్టత లేకపోతే.. సూటిగా మాట్లాడలేరు. వివరంగా చెప్పలేరు. ప్రతి చిన్న విషయంలోనూ అయోమయమే. మిమ్మల్ని
Personality Development Tips 1 | ఆలోచనల్లో స్పష్టత లేకపోతే.. సూటిగా మాట్లాడలేరు. వివరంగా చెప్పలేరు. ప్రతి చిన్న విషయంలోనూ అయోమయమే. మిమ్మల్ని మీరే సందేహిస్తారు. మీ బాస్ ఆదేశాలను అమలు చేయలేరు. మీ కింది సిబ్బందికి సూచనలు ఇవ్వలేరు. ఆ అస్పష్టత బంధాలనూ దెబ్బతీస్తుంది. ఓ విజేతకు ఉండాల్సిన లక్షణమే కాదిది.
వన్.. టు.. త్రీ.. రన్!
ఇద్దరు యువకుల కెరీర్ పరుగు మొదలైంది. మొదటివాడు ఐఐఎమ్ పట్టభద్రుడు. రెండోవాడు టెన్త్ ఫెయిల్.
మొదటివాడు.. ఓ ఐటీ కంపెనీ ప్రారంభించాడు. రెండోవాడు ఇడ్లీబండి తెరిచాడు.
మొదటివాడు ఐటీ బూమ్ పడిపోయిందని, నిర్మాణ రంగంలోకి వచ్చాడు. అక్కడ రాజకీయాలు ఎక్కువని, ఓ కార్పొరేట్ స్కూల్ ఫ్రాంచైజీ తీసుకున్నాడు, కరోనా సమయంలో అడ్మిషన్లు పడిపోవడంతో ఆ వ్యాపారమూ వద్దనుకున్నాడు.
రెండోవాడు మాత్రం ఇడ్లీల వ్యాపారాన్ని వదిలిపెట్టలేదు. అందులోనే కొత్త ప్రయోగాలు చేశాడు. అపార పోషక విలువలు కలిగిన మిల్లెట్ ఇడ్లీల మీద పేటెంట్ సంపాదించాడు. పెద్ద రెస్టారెంట్ తెరిచాడు. జిల్లా కేంద్రాల్లో శాఖలు ప్రారంభించాడు. ఐపీఓకు వెళ్లాడు. వేలకోట్లు సేకరించి విదేశాలకూ విస్తరించాడు. ఆ వ్యవహారాలు చూసుకోవడానికి పాతికమంది ఐఐఎమ్ పట్టభద్రులను నియమించుకున్నాడు. అందులో చివరివాడు.. మన కథలోని మొదటివాడు!
విజేతకు, సామాన్యుడికి మధ్య దూరం.. ఆలోచనల్లో స్పష్టత. మీ ఆలోచనల్లో స్పష్టత ఉంటే, అది ఆచరణలోనూ కనిపిస్తుంది. లేకపోతే మాత్రం గందరగోళమే.
ఒక గిన్నెలో చక్కెర, కారం, చింతపండు, ఉప్పు వేసి కలిపారనే అనుకోండి. ఆ పదార్థం తియ్యగా ఉంటుందా, ఉప్పగా ఉంటుందా, కారంగా ఉంటుందా? తేల్చి చెప్పడం కష్టం. ఆలోచనలూ అంతే. ఒకేసారి పది విషయాలను బుర్రలో తోసేస్తే అంతా కలగాపులగం అవుతుంది. ఒక సమయంలో ఒకే విషయం మీద దృష్టిపెట్టండి. సర్వశక్తులూ ఆ ఆలోచన కోసమే ధారపోయండి. ఆధ్యాత్మిక పరిభాషలో దీన్నే తపస్సు అంటారు.
మాయదారి మనసు స్థిమితంగా ఉండదు. వాట్సాప్ మెసేజ్‌లు చూసుకోమంటుంది. ఓటీటీలో కొత్త సినిమాలు ఉన్నాయేమో బ్రౌజ్ చేసి చెప్పమంటుంది. ఫ్రెండ్‌తో చాట్ చేయమని వెంటపడుతుంది. ఆ వ్యాపకాలన్నీ ఏకమై ఆలోచనను పక్కదారి పట్టిస్తాయి. ప్రస్తుతం మనం దృష్టిపెట్టాల్సిన విషయం వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనదని తెలుసుకోండి.
చెట్టు మీదినుంచి యాపిల్ రాలిపడుతుంది. ఇది ప్రాథమికమైన విషయం. ‘ఎందుకు పడుతుంది?’ అని ఒక్క న్యూటన్ మాత్రమే ప్రశ్నించాడు. న్యూటన్‌కు మాత్రమే జవాబు దొరికింది. ఏ విషయం గురించి అయినా ఆలోచిస్తున్నప్పుడు నిర్మొహమాటంగా, నిర్భయంగా ‘బేసిక్స్’ను ప్రశ్నించాలి. పాతదారిని వదిలిపెట్టాలి. ఎంగిలి ఫార్ములాలను తిరస్కరించాలి. తొలి
దశలో బుర్ర వేడెక్కినట్టు అనిపిస్తుంది. ఏం ఫర్వాలేదు. వెనక్కి తగ్గొద్దు.
పొట్ట నిండినప్పుడు వచ్చేవి ఆలోచనలు కాదు.. గురక. పొట్ట ఖాళీగా ఉన్నా ఆలోచనలు రావు, అలసట వస్తుంది. కాబట్టి, ఆలోచనకు ముందు తగినంత ఆహారం అవసరం. స్నానానికి, తిండికి, నిద్రకు సమయం కేటాయించినట్టే, ఆలోచనకూ ఓ అరగంట పక్కనపెట్టండి. ఇదొక కసరత్తు. డాగ్ స్కాడ్ వాళ్లు శునకానికి శిక్షణ ఇచ్చినట్టు మనం మెదడుకు తర్ఫీదు ఇస్తాం.
మన ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చినప్పుడు స్పష్టత వస్తుంది. ఆత్మీయులతో చర్చించినప్పుడు భిన్న కోణాలు బయటికి వస్తాయి. అయితే, ఆ చర్చ స్వేచ్ఛాయుత వాతావరణంలో సాగాలి. మనం సద్విమర్శల్ని స్వీకరించగలిగితేనే ఇదంతా సాధ్యం. వినదగునెవ్వరు చెప్పిన.. అనే సుమతీశతక వాక్యాన్ని అస్సలు విస్మరించొద్దు.
ఎప్పుడూ మన ఆలోచనలతో మనం ప్రేమలో పడకూడదు. ఆ ఆలోచన చుట్టూ వ్యామోహాన్ని అల్లుకోకూడదు. మనం వేరు. మన ఆలోచన వేరు. అవసరమైతే, దానికి మెరుగులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సమకాలీనత లోపించినప్పుడు నీళ్లు వదిలేసుకున్నా నష్టం లేదు. ఆలోచనల ఊటబావి ఊరుతూనే ఉంటుంది.
ఆలోచనకు సమాచారం ముడిసరుకు. పుస్తకం పఠనం ద్వారా కొంత, సమాజాన్ని అధ్యయనం చేయడం ద్వారా కొంత.. ఆలోచనా శక్తి మెరుగుపడుతుంది. దాన్ని మీదైన శైలిలో విశ్లేషించాలి. లోపాలను ఏరెయ్యాలి. చివరికి మిగిలేదే.. ఆచరణాత్మకమైన ఆలోచన. మీ జీవితాన్ని మార్చే శక్తి ఒక్క ఆలోచనకే ఉంది.. ఆ ఆలోచన ఎంత స్పష్టంగా ఉంటే, గెలుపు అంత త్వరగా సిద్ధిస్తుంది.
Read More :
ఎకో ఫ్రెండ్లీ ఐడియాలతో పెద్ద కంపెనీలకు ధీటుగా నిలుస్తున్న యంగ్ ఆంత్రప్రెన్యూర్స్”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

