ఇప్పుడు నలభై దాటకముందే గుండెనొప్పితో కుప్పకూలిపోతున్న వాళ్ల వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఊబకాయులు, పని ఒత్తిడిలో కుంగుబాటుకు గురవుతున్నవాళ్లు, ఇతర శారీరక సమస్యలపై అవగాహన లేమితో అనవసరంగా ఆందోళన చెందుతూ ఆరోగ్యంతోపాటు డబ్బునూ పాడు చేసుకుంటున్న వాళ్లు ఎక్కువైపోతున్నారు. వీటన్నిటికి పరిష్కారం ఆరోగ్యం గురించి, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి తెలుసుకోవడమే. ఇలాంటి సమయంలో మనకు ఎదురవుతున్న వివిధ రకాల అనారోగ్య పరిస్థితులు, వాటి నిర్ధారణ, చికిత్స గురించి వివరిస్తూ డాక్టర్ ప్రతిభా లక్ష్మి ‘చేత(తు)ల్లో ఆరోగ్యం’ పేరుతో పుస్తకం అందుబాటులోకి తెచ్చారు.
కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు చేసే సీపీఆర్ విధానం, సాధారణ జ్వరం, జలుబు మొదలుకుని మనిషిని దీర్ఘకాలం పీడించే క్షయ, డయాబెటిస్, క్యాన్సర్ వరకు ఈ పుస్తకంలో చాలా వ్యాధుల వివరాలను పొందుపర్చారు. పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి ఏం చేయాలి, చార్ధామ్ లాంటి పర్వత ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మానసిక అనారోగ్యం వెనక ప్రజలకు ఉండే మూఢనమ్మకాలు మొదలైన విషయాల గురించి ఓ వైద్యురాలిగా తన బాధ్యతను ప్రతిభా లక్ష్మి నిర్వహించారు. ఆరోగ్యం గురించి తెలుసుకుని మంచి జీవితాన్ని ఆరంభించడానికి ‘చేత(తు)ల్లో ఆరోగ్యం’ మంచి ఆలంబనగా నిలుస్తుంది.
రచన: డాక్టర్ ప్రతిభా లక్ష్మి
పేజీలు: 158; ధర: రూ. 200
ప్రచురణ: తపస్వి మనోహరం పబ్లికేషన్స్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
రచన: మన్నెం శారద
పేజీలు: 228;
ధర: రూ. 200
ప్రచురణ: జె.వి.పబ్లికేషన్స్
ప్రతులకు: ఫోన్: 85588 99478
రచన: ఎమ్బీయస్ ప్రసాద్
పేజీలు: 248;
ధర: రూ. 150
ప్రతులకు: ఫోన్: 90004 13413
రచన: వారాల ఆనంద్
పేజీలు: 198;
ధర: రూ. 150
ప్రచురణ: ప్రోజ్ పోయెట్రీ ఫోరం
ప్రతులకు: 94405 01281