e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home బతుకమ్మ ఎస్కేప్‌ అయిపోతారు!

ఎస్కేప్‌ అయిపోతారు!

మీకు సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ ఇష్టమా? పజిల్స్‌ పరిష్కరించడం వెన్నతో పెట్టిన విద్యా? ఏదైనా మిస్టరీని ఛేదించాలనే కుతూహలం టన్నులకొద్దీ ఉందా? అయితే, ఓ సారి ‘ఎస్కేప్‌ రూమ్‌’కు వెళ్లిరండి. ఎంటర్‌టైన్‌మెంట్‌ కిలోల్లో కాదు.. టన్నుల్లో దొరుకుతుంది. మహానగరాల్లో పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రస్తుతం ఎస్కేప్‌ రూమ్‌లలోనే గడుపుతున్నారు.

ఆఆవరణలో కాలుపెడితే.. ఆశ్చర్యాలకు, ఉద్విగ్నతలకూ కొదవే ఉండదు. విదేశాల్లో బాగా డిమాండ్‌ ఉన్న ‘ఎస్కేప్‌ రూమ్‌’ కల్చర్‌ ఇప్పుడు మనదేశానికీ వచ్చేసింది. హైదరాబాద్‌కూ విస్తరించింది. నిజానికి ఈ ట్రెండ్‌ ‘వర్చువల్‌ ఎస్కేప్‌ రూమ్‌’లతో మొదలైంది. ఆన్‌లైన్‌లో ఆటకు కూర్చోగానే ఓ గది ప్రత్యక్షం అవుతుంది. మనం అందులోకి వర్చువల్‌గా ప్రవేశిస్తాం. డిటెక్టివ్‌ అవతారం ఎత్తి నేర పరిశోధన చేస్తాం. శవాల గుట్టు విప్పతాం. దెయ్యాల పని పడతాం. నేరగాళ్లను అరెస్ట్‌ చేస్తాం. ఆ ఫార్ములా విజయవంతం కావడంతో ఆఫ్‌లైన్‌లోనూ ఎస్కేప్‌ రూమ్స్‌ వెలుస్తున్నాయి.

- Advertisement -

ఎస్కేప్‌ రూమ్‌ అంటే?
ఎస్కేప్‌ గేమ్‌ ఓ రహస్యాల గది. ఈ గేమ్‌లో పాల్గొనేవాళ్లు ఓ నిగూఢ రహస్యాన్ని ఛేదించి, కీలకమైన ఓ తాళం సంపాదించి నిర్ణీత సమయంలోపు బయటపడాలి. అందుకు అవసరమైన క్లూ, పజిల్స్‌ అందుబాటులోనే ఉంటాయి. ఒక గదిలో ఎన్ని టాస్క్‌లు అయినా ఉండవచ్చు. ఒక్కసారి ఈ గేమ్‌ సైట్‌లోకి ఎంటర్‌ అయితే, ఎలా గెలవాలనే పట్టుదల తప్పించి, క్విట్‌ కావాలనే ఆలోచనే రాదు. అప్పటికప్పుడు మనలోని ఓ డిటెక్టివ్‌ బయటికొస్తాడు. మన బుర్రలో ఓ కౌబాయ్‌ తిష్ఠ వేస్తాడు. వెతికినవాళ్లకు వెతికినంత వినోదం. ఈ గేమ్స్‌ను ఎవరైనా ఆడవచ్చు. మొదట ఈ కాన్సెప్ట్‌ను హాలీవుడ్‌ సినిమాల ఆధారంగా రూపొందించారు. చైనీయులు ఓ అడుగు ముందుకేసి వర్చువల్‌గా ఓ నకిలీ హత్యకు సంబంధించి హంతకుడిని పట్టుకునేలా ఎస్కేప్‌ రూమ్స్‌ను డిజైన్‌ చేశారు.

అన్ని నగరాల్లో
‘నో ఎస్కేప్‌ ముంబై’ మహారాష్ట్రలో బాగా పాపులర్‌ అయ్యింది. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌, గురుగ్రామ్‌, పుణె వంటి నగరాల్లో ఇప్పటికే కొన్ని ఎస్కేప్‌ రూమ్‌లు వెలిశాయి. ఈ గదుల్లోకి ఒక్కరైనా వెళ్లొచ్చు, స్నేహితులు, కుటుంబ సభ్యులతోనూ సందడి చేయవచ్చు. కార్పొరేట్‌ ఉద్యోగులే లక్ష్యంగా.. ఈ నిబిడాశ్చర్యాల వ్యాపారం నిర్వాహకులకు భారీగానే ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నది.

ఆన్‌లైన్‌లో అనేక రకాలు..
వీడియో గేమ్స్‌ మాదిరిగానే, ఎస్కేప్‌ రూములను కూడా ప్రజల అభిరుచుల ఆధారంగా రూపొందించారు. భారతీయులను ఆకట్టుకునేలా ‘థీమ్‌ బేస్డ్‌ ఎస్కేప్‌’ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బాలీవుడ్‌, హాలీవుడ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ ఆధారంగా మిస్టరీ గేమ్స్‌ వచ్చాయి. క్లూ హంట్‌ విభాగంలో ఎస్కేప్‌ రూమ్‌, క్లూ ఫైండర్‌, మినీ థియేటర్‌, లైవ్‌ యాక్షన్‌ ఫ్లిక్‌ వంటివి ఉన్నాయి. ఇవేకాకుండా అంతర్జాతీయంగా పేరుగాంచిన హౌజ్‌ ఆఫ్‌ మిస్టరీస్‌, ది అమేజింగ్‌ ఎస్కేప్‌, ఎస్కేప్‌ రూమ్‌ యూఎస్‌ఏ, ఔటర్‌ లైఫ్‌ స్టూడియోస్‌, స్మోకీ మౌంటైన్‌ ఎస్కేప్‌ వంటివీ ఆన్‌లైన్‌ వేదికగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ప్రేమికులను అలరిస్తున్నాయి. వాటికి కొనసాగింపే ఆఫ్‌లైన్‌ రూమ్స్‌. తెరమీద చూసినవన్నీ కట్టెదుట దర్శనమిస్తాయి.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement