BJP MLA Rekha Patra | ‘ఆవుల జనన ధృవీకరణ పత్రాలు చూపించాలి’.. బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్య, టీఎంసీ విమర్శ
BJP MLA Rekha Patra | ఆవుల జనన ధృవీకరణ పత్రాలు చూపించాలని బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేపై టీఎంసీ మండిపడింది.
కోల్‌కతా: ఆవుల జనన ధృవీకరణ పత్రాలు చూపించాలని బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేపై టీఎంసీ మండిపడింది. (BJP MLA Rekha Patra) శనివారం హింగల్గంజ్ పరిధిలోని లెబుఖాలి ప్రాంతంలో పశువులను రవాణా చేస్తున్న వాహనాన్ని ఆ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర అడ్డుకున్నారు. పశువులను వాహనం నుంచి కిందకు దించారు. రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు వాటిని కట్టారు. వాటికి గడ్డి, నీరు ఏర్పాటు చేశారు.
కాగా, అక్రమ పశు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదేశాలు జారీ చేశారని బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర తెలిపారు. అలాగే 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పశువులను వధించకూడదని తమ ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసిందని ఆమె చెప్పారు. ‘14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆవులను వధించడంపై ప్రభుత్వం కఠిన నిషేధం అమలు చేసింది. ఎవరైనా ఆవులను అక్రమంగా రవాణా చేస్తే మేం అడ్డుకుంటాం. ఆవుల జనన ధృవీకరణ పత్రాలు చూపించమని అడుగుతాం. జనన ధృవీకరణ పత్రాన్ని చూపించడంలో విఫలమైతే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటాం’ అని ఆమె అన్నారు.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. బీజేపీ పాలనలో ఉన్న, లేక ఇతర రాష్ట్రంలోనైనా ఆవుకు జారీ చేసిన జనన ధృవీకరణ పత్రాన్ని ఆ ఎమ్మెల్యే చూపించగలరా? అని టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ ప్రశించారు. ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఆవుకు జారీ చేసిన ఒక జనన ధృవీకరణ పత్రాన్ని తీసుకురావాలని గౌరవనీయ ఎమ్మెల్యేను మేం అభ్యర్థిస్తున్నాం. రిఫరెన్స్ కోసం అది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆవు జనన ధృవీకరణ పత్రాన్ని బీజేపీ చూపించగలిగితే, ఆ సర్టిఫికేట్లను ఎవరు జారీ చేశారో మేం తనిఖీ చేస్తాం’ అని అన్నారు.
BIG! West Bengal BJP MLA Rekha Patra stops an illegal cattle transport truck at Dulduli Ferry Ghat, Hingalganj. She personally intervened, got the cattle unloaded, provided water & fodder on spot, and alerted police & administration. pic.twitter.com/R7NAoKn8sD
— Vinamra Koolwal (@NotKanjusBaniya) May 17, 2026
PORIBORTON #WestBengal
JUST WHEN I NEEDED ENTERTAINMENT!!!
@BJP4Bengal MLA Rekha Patra talks about “BIRTH CERTIFICATES FOR COWS” pic.twitter.com/DlwtFKD9ra
— KALLURI (@I_KALLURI) May 17, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

