Thailand Open : థాయ్‌లాండ్ ఓపెన్ ఫైనల్లో భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj) – చిరాగ్ శెట్టి (Chirag Shetty)కి చుక్కెదురైంది. సెమీస్‌లో సంచలన విజయంతో టైటిల్ పోరుకు దూసుకెళ్లిన ఈ జోడీకి లియో రాలీ కర్నాండో – డానియెల్ మార్టిన్(ఇండోనేషియా) చెక్ పెట్టారు. ఆదివారం జరిగిన ఫైనల్లో గట్టిగా పోరాడినా భారత జంటకు ఓటమి తప్పలేదు. కెరీర్లో తొలిసారి వీరి చేతిలో సాత్విక్ చిరాగ్ జోడీ ఓటమి ఎదురైంది.
థామస్ కప్‌లో కాంస్యంతో మెరిసిన సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం థాయ్‌లాండ్ ఓపెన్‌లో టైటిల్ చేజార్చుకుంది. ఈ సీజన్లో తొలి ఫైనల్లో చెలరేగుతారనుకుంటే ఉసూరుమనిపించింది. సెమీఫైనల్లో మలేషియా షట్లర్లపై అదిరే విజయంతో టైటిల్‌పై ఆశలు రేపినా చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండోనేషియా జోడీ లియో రాలీ కర్నాండో – డానియెల్ మార్టిన్ ధాటికి భారత జంట చేతులెత్తేసింది.
Back on the podium!🧸🥈
[📸 @badmintonphoto ] pic.twitter.com/YejCphuvpM
— BAI Media (@BAI_Media) May 17, 2026
తొలి సెట్‌ను మరీ దారుణంగా 12-21తో కోల్పోయిన సాత్విక్ – చిరాగ్ రెండో సెట్లో గట్టిగానే ప్రతిఘటించారు. ప్రత్యర్థితో పోటీపడి పాయింట్లు సాధించారు. కానీ, మార్టిన్ జంప్ స్మాష్‌లతో విరుచుకుపడగా రెండు పాయింట్ల తేడాతో భారత ద్వయం కంగుతిన్నది. వరస సెట్లలో విజయంతో లియో – డానియెల్ జోడీ టైటిల్‌ను తన్నుకుపోయింది.