tattoo | టాటూలతో ఇలాంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయా?
tattoo | కొన్ని జ్ఞాపకాలు వెంటాడుతాయి. కొన్ని గుర్తులు నరకయాతనకు గురిచేస్తాయి. కొన్ని అనారోగ్యాలు ఎన్నోకొన్ని ఆనవాళ్లను వదిలి వెళ్తాయి. వాటిని ఇష్టంగా ఆమోదించలేం. అలా అని శాశ్వతంగా వదిలించుకోనూ లేము. ఈ సమస్యకు తిరుగులేని పరిష్కారం కనిపెట్టారు టాటూ ఆర్టిస్టులు.

రాకేశ్ ఎడమవైపు ఊపిరితిత్తి ఇన్ఫెక్షన్కు గురైంది. వెంటనే ఆపరేషన్ జరిగింది. కానీ, ఆ గాయం తాలూకు గుర్తు అతణ్ని వెంటాడుతూనే ఉంది. హైదరాబాద్‌కు చెందిన స్వాతికి సోరియాసిస్. ఒళ్లంతా ఎర్రటి మచ్చలు. బోరబండలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజినీర్ భార్గవిది మరోబాధ. పొట్టనిండా గీతలే. చీరకట్టులోనో, మోడ్రన్ డ్రెస్సులోనో పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లాలంటే బిడియం. ఒకరో ఇద్దరో కాదు.. జీవితం చేసిన శాశ్వత గాయాల వల్ల నలుగురిలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నవారు ఎంతోమంది. ఇకనుంచి ఆ బిడియాలు అవసరం లేదు. బేఫికర్‌గా ఆధునిక దుస్తులు ధరించవచ్చు. మచ్చలకు, ముడతలకు, కుట్ల ఆనవాళ్లకు తిరుగులేని పరిష్కారం చూపుతున్నారు టాటూ ఆర్టిస్టులు. గాయం మచ్చలపై అద్భుతమైన టాటూలు వేస్తూ సరికొత్త ట్రెండ్‌కు ప్రాణం పోస్తున్నారు. శస్త్రచికిత్సకు గురైన వెన్నుపూస, కాలిన చేతులూ కాళ్లు, సిజేరియన్ మచ్చలు, కణుతులు తొలగించగా ఏర్పడిన మచ్చలు, పులిపిర్లు, చేతివేళ్ల గాయాలు, మెడపై ముడతలు, ఆర్థోపెడిక్ ఆపరేషన్ల తాలూకు గుర్తులు, సోరియాసిస్ ప్రభావాలు.. కావేవీ టాటూలకు అనర్హం అంటున్నారు. ఈ తరహా టాటూలకు హైదరాబాద్‌లోనూ ఆదరణ పెరుగుతున్నది. గాయాల బాధితులు నిర్భయంగా ముందుకొచ్చి నచ్చిన టాటూలు వేయించుకుంటున్నారు. ప్రేమించినవారి పేర్లను టాటూలుగా వేసుకొని, తీరా వేరొకరితో పెండ్లి జరిగాక.. పాత ఆనవాళ్లపై కొత్త చిత్రాలు వేసుకుంటున్నవారూ అనేకం.

కష్టమైన పనే..
ఇదేమంత తేలికైన వ్యవహారం కాదు. గాయం అయిన చోట సాధారణ చర్మం అతి మందంగానో, మహా సున్నితంగానో ఉంటుంది. కాబట్టి, టాటూ వేయడం చాలా కష్టం. అయినా, అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు టాటూ ఆర్టిస్టులు. మచ్చలను కవర్ చేసేలా.. నచ్చిన ఆకారాలు, రంగులు ఎంచుకోవచ్చు.ఎందుకు ఆలస్యం? ఇన్నాళ్లూ ఇబ్బందిగా అనిపించిన గాయాల తాలూకు మచ్చలపై కళాఖండాలు చిత్రించుకొని, స్వేచ్ఛగా విహరించండి.











లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
OTT | 2008లోనే భారత్‌లో ఓటీటీ వచ్చిందా? డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌తో లాభమా? నష్టమా?
mini bengal | తెలంగాణలో మినీ బెంగాల్.. కట్టుబొట్టూ అంతా ఉత్తరాది స్టైలే !!
Mia Khalifa : అభిమాని కాలిపై అశ్లీల నటి మియా ఖలీఫా టాటూ.. ఏం చేసిందో తెలుసా..?
Samantha tatto: సమంత ఒంటిపై మూడు టాటూలు.. వాటి అర్ధం ఏంటో తెలుసా?
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

