Mia Khalifa : అభిమాని కాలిపై అశ్లీల నటి మియా ఖలీఫా టాటూ.. ఏం చేసిందో తెలుసా..?
Viral Video: మియా ఖలీఫా..! లెబానాన్‌కు చెందిన ఈమె మాజీ పోర్న్ స్టార్..! ఈమెకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు..! ఆమె శృంగార తారగా నటిస్తున్న కాలంలో నిత్యం వార్తల్లో ఉండేది..! కానీ, ఈ మధ్య చాలాకాలంగా ఆమె వార్తల్లో లేదు..! అయితే, భారత్‌కు చెందిన ఓ అభిమాని చేసిన పని కారణంగా ఆమె పేరు ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది..!

Viral Video: మియా ఖలీఫా..! లెబానాన్‌కు చెందిన ఈమె మాజీ పోర్న్ స్టార్..! ఈమెకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు..! ఆమె శృంగార తారగా నటిస్తున్న కాలంలో నిత్యం వార్తల్లో ఉండేది..! కానీ, ఈ మధ్య చాలాకాలంగా ఆమె వార్తల్లో లేదు..! అయితే, భారత్‌కు చెందిన ఓ అభిమాని చేసిన పని కారణంగా ఆమె పేరు ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది..! ఇంతకూ ఆ అభిమాని చేసిన పనేందంటే.. తన కాలుపై మియా ఖలీఫా ముఖం చిత్రాన్ని టాటూలా వేసుకోవడం.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ టాట్టూ ఆర్టిస్టుకు పోర్న్ స్టార్ మియా ఖలీఫా అంటే చాలా అభిమానం. అందుకే ఆ శృంగార తారపట్ల తనకు ఉన్న అభిమానాన్ని, భక్తిని టాటూ రూపంలో ప్రదర్శించాడు. ఆమె ఫేస్ ఫొటోను తన కాలుపై టాటూలా వేసుకున్నాడు. ఆపై ఆ దృశ్యాలను వీడియో తీసి కొన్ని వారాల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్చేశాడు. తన ఇన్స్టాగ్రామ్ పేజీ ‘tattoo_artist_01’ లో ఆ వీడియోను అప్లోడ్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే.. ఓపెన్ చేయగానే టాటూ ఆర్టిస్ట్ కాలు కనిపిస్తుంది. ఆ కాలుపై నురగ, ఆ నురగ లోపల కనిపించీ కనిపించనట్లుగా ఓ నల్లని చిత్రం ఉంటుంది. మనం ఆ నురగ వెనుక ఉన్న చిత్రం ఎవరిదా అని ఆలోచిస్తుండగానే.. అతను ఓ టిష్యూ పేపర్‌తో తన కాలుపై ఉన్న నురగను కింది నుంచి పైకి తూడుస్తూ ఉంటాడు. ఆ తూడ్చే క్రమంలో పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫేస్ ఫొటో మెల్లమెల్లగా రివీల్ అవుతుంది. ఆ చిత్రంలో మియా ఖలీఫా సిగ్నేచర్ గ్లాసెస్ ధరించి ఉంటుంది.
Viral Video: టాటూపై మియా ఖలీఫా ఎలా స్పందించిందంటే..
అభిమాని తన ఫేస్ ఫొటోను కాలు మీద టాటూలా వేసుకోవడంపై మియా ఖలీఫా అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇది చాలా ఘోరమైన పని అని కామెంట్ చేసింది. టాటూ ఆర్టిస్ పోస్ట్ చేసిన వీడియో క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ.. “ప్లీజ్ సే సైక్… దిస్ ఈజ్… టెరిబుల్,” అంటూ క్యాప్షన్ రాసింది. ఆ పోస్టుకు తాగిన మత్తులో ఉన్న ఎమోజీని కూడా యాడ్ చేసింది. తన అభిమాని తాగిన మైకంలో ఇలాంటి పనిచేశాడనడానికి సంకేతంగా ఆమె ఈ ఎమోజీని యూజ్ చేసినట్లు తెలుస్తున్నది.
మియా ఖలీఫా స్పందనపై సంతోషం వ్యక్తం చేసిన టాటూ ఆర్టిస్ట్
ఢిల్లీ టాటూ ఆర్టిస్టు చేసిన పనిపై శృంగారం తార మియా ఖలీఫా అసహనం వ్యక్తంచేసినా అతను మాత్రం ఏ మాత్రం బాధపడలేదు. పైగా తన పోస్టుకు ఆమె రెస్పాండ్ అయినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. మియా ఖలీఫా తన వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ రిప్లై ఇచ్చినందుకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాంతో అతను ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆ వీడియో 40 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్‌కు కూడా కృతజ్ఞతలు చెప్పాడు. కాగా, మియా ఖలీఫాకు 2017లో కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పట్లో పోర్చుగల్‌కు చెందిన ఓ అభిమాని తన తొడపై మియా ఖలీఫా ముఖాన్ని టాటూలా వేసుకున్నాడు. అప్పట్లో దానిపై కూడా ఆమె అసహనం వ్యక్తపర్చింది.
మియా ఖలీఫా సిగ్నేచర్ గ్లాసెస్ వెనుక ఓ ఆసక్తికర కథనం..

మియా ఖలీఫా ఎక్కువగా తనకు ఇష్టమైన సిగ్నేచర్ ధరించి కనిపిస్తుంటుంది. అయితే, ఆ సిగ్నేచర్ గ్లాసెస్‌కు ఓ ప్రత్యేకత ఉంది. వాటి వెనుక ఓ ఆసక్తి కరమైన కథనం ఉన్నది. బీరుట్ పేలుళ్ల సందర్భంగా మియా ఖలీఫా తన సిగ్నేచర్ గ్లాసెస్‌ను వేలం వేసింది. వేలంలో ఆ గ్లాసెస్ లక్ష అమెరికన్ డాలర్ల (రూ.73 లక్షలు) ధర పలికాయి. ఆ మొత్తాన్ని ఆమె పేలుళ్ల బాధితుల పునరావాసం కోసం విరాళంగా అందజేసింది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

