Scamsters | వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం తెలివైనవారి పని. అలాంటిది తలపండిన స్కామర్లకే అవకాశం చిక్కితే అంత తేలిగ్గా వదులుతారా! ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు ముగిసినా.. వీళ్లు మాత్రం పన్ను మీద కన్నేస్తున్నారు. ఇప్పటికే ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసిన వారిని ఒకరకంగా, చేయని వాళ్లను మరోరకంగా టార్గెట్ చేస్తున్నారు. చిన్న లింక్‌తో ఆర్థిక స్థితిగతులు రాబడుతున్నారు. అదే అదనుగా అందినకాడికి దండుకుంటున్నారు. ఈ స్కామ్స్టర్లు ఎలాంటి ఉచ్చు పన్నుతారు, అందులో చిక్కకుండా ఎలా తప్పించుకోవాలి అనే విషయంలో కనీస అవగాహన ఉండాలి.
కుశాల్ భట్నాగర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. మిస్టర్ పర్ఫెక్ట్. ఏడాదికి యాభై లక్షల ప్యాకేజీతో మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు. గడువు మొదలైందో లేదో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశాడు. పన్ను తగ్గించుకునే మార్గాలు అన్వేషిస్తున్న సహోద్యోగులను సుతిమెత్తగా హెచ్చరించాడు కూడా! అప్పుడే కుశాల్ ఫోన్‌కు ఓ సందేశం వచ్చింది. అది చూడగానే కంగారు పడ్డాడు. ‘ప్రియమైన పన్ను చెల్లింపుదారులారా! ఐటీ రిటర్స్న్ దాఖలు చేసినందుకు ధన్యవాదాలు. మీ ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాలు పొందుపర్చలేదు. మరిన్ని వివరాలకు క్లిక్.. ’ అని ఓ లింక్ కనిపించింది. మరో ఆలోచన లేకుండా కుశాల్ వెంటనే లింక్ క్లిక్ చేశాడు. పాన్ నంబర్ ఎంటర్ చేశాడు. ఇంతలో తన బ్యాంకు ఖాతానుంచి 12వేలు డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. అప్పుడుగానీ స్కామర్లకు చిక్కానని కుశాల్‌కు అర్థం కాలేదు!
సీజన్‌కు తగ్గట్టుగా..
ఒక్కో సీజన్లో కొన్నిరకాల వ్యాధులు విజృంభించినట్టు.. స్కామర్లు కూడా సందర్భోచితంగా దాడులు చేస్తుంటారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ట్యాక్స్‌పేయర్లను తెలివిగా ఎంచుకుంటారు. పన్ను కట్టే వేళ కావడంతో అందుకు సంబంధించిన సందేశాలను సీరియస్‌గా తీసుకుంటారని వాళ్ల నమ్మకం. వెయ్యిమందిలో నలుగురు స్పందించినా వాళ్లు విజయం సాధించినట్టే! స్కామర్లు తెలివిగా పంపే సందేశాలు ఇదిగో ఇలా ఉంటాయి…
పక్కాగా ఎర
ఎంతటివారికైనా పోలీసులన్నా, ప్రభుత్వమన్నా, ఐటీ అన్నా కాస్త బెరుకు ఉండటం సహజం. ఈ బలహీనతనే ఎరగా వాడుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఆధునిక సాంకేతికత సహకారంతో దాడులకు పాల్పడుతున్నారు. ఆదాయపు పన్నుశాఖకు చెందిన లోగోను స్పూఫ్ చేసి మరీ మెయిల్ పంపుతుంటారు. అధికారిక లెటర్ హెడ్స్‌ను పోలిన పత్రాలను వినియోగిస్తుంటారు.
తెలివిగా వ్యవహరించి..
ఈ ఉచ్చులో చిక్కిన తర్వాత తప్పించుకోవడం కష్టమే! కానీ, కాస్త తెలివిగా వ్యవహరిస్తే స్కామర్ల ఎరకు చిక్కకుండా ఉండొచ్చు. అదెలా అంటే..
ఐటీ మొబైల్ అప్లికేషన్లు నేరుగా apk, dmz తదితర ఫార్మాట్లో ఉన్నవి డౌన్లోడ్ చేయొద్దు. ప్లేస్టోర్ నుంచి అధికారిక అప్లికేషన్లను మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.
ఈ వివరాలు అడగదు
-అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్