1.మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో వందేళ్లకు పైగా వయసున్న ఓ ఏనుగు జూలై 8న మరణించింది. ఆసియాలోనే అత్యంత పెద్ద వయసుదిగా పేరుగాంచిన ఆ గజరాజు పేరేంటి?
2. జూలై 3న స్పెయిన్ దేశంలో జరిగిన ఓ కారు ప్రమాదంలో పోర్చుగల్‌కు చెందిన ఓ ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు మృతిచెందాడు. అతని పేరేంటి?
3. జూలై 6న కజక్‌స్తాన్ రాజధాని ఆస్తానాలో బాక్సింగ్ ప్రపంచకప్ ఫైనల్స్ పోరు జరిగింది. ఇందులో అమెరికాకు చెందిన యోస్లిన్ పెరెజ్‌పై భారత క్రీడాకారిణి గెలిచి స్వర్ణ పతకం అందుకుంది. ఆమె పేరేంటి?
4. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం పన్నుల మార్పుల్లో భాగంగా ‘బిగ్ బ్యూటిఫుల్’ చట్టం తీసుకువచ్చింది. దీన్ని నిరసిస్తూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఓ కొత్త పార్టీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాడు. ఆ పార్టీ ఏది?
5. 2024 25 ఎడిషన్‌కు సంబంధించి ప్రపంచంలో ‘100 అత్యుత్తమ ఆహార నగరా’ల జాబితాను టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసింది. ఇందులో భారతదేశం నుంచి 6 నగరాలకు
చోటు దక్కింది? 50వ స్థానంలో నిలిచిన నగరం ఏది?
6. దేశ ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి సహకార రంగం కీలకంగా నిలుస్తుంది. సహకార వ్యవస్థను బలోపేతం చేసే దిశగా దేశంలోనే మొదటి సహకార విశ్వవిద్యాలయం గుజరాత్ రాష్ట్రం ఆనంద్‌లో ఏర్పాటుకానుంది. ఎవరి పేరుమీద?
7. 1999లో అర్జున్ హీరోగా ఒక్కరోజు ముఖ్యమంత్రి అంశంతో ‘ఒకే ఒక్కడు’ సినిమా వచ్చింది. ఇటీవల థాయ్‌లాండ్ దేశంలో ‘ఒక్కరోజు ప్రధానమంత్రి’ అనే వార్త సంచలనంగా నిలిచింది. థాయ్‌లాండ్ ఒకే ఒక్కడు ఎవరు?
8. భారతీయులు బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు వెస్టిండీస్ దీవుల్లో భాగమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోకు కార్మికులుగా వలస వెళ్లారు. ఇటీవల ఆ దేశపు ప్రధానమంత్రి ‘బీహార్ బేటీ’గా వార్తల్లో నిలిచారు. ఆమె ఎవరు?
9. డా. సి.నారాయణరెడ్డి జ్ఞాపకార్థం ‘సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు’ ప్రతి ఏడాది ‘విశ్వంభర’ జాతీయ సాహిత్య పురస్కారం ప్రదానం చేస్తుంది. ఈ ఏడాది ఈ అవార్డుకు ఎవరిని ఎంపికచేశారు?
10. యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఓ భారతీయ ఆధ్యాత్మిక వేత్తకు ఇటీవల ‘బ్లూ టంగ్’ పురస్కారం లభించింది. జర్మనీకి చెందిన గ్రియేటర్ సంస్థ ఇచ్చే ఈ పురస్కారం
అందుకున్నది ఎవరు?
జవాబులు
1. వత్సల
2. డియోగో జోటా (28 ఏండ్లు)
3. సాక్షి చౌధరి
4. అమెరికా పార్టీ
5. హైదరాబాద్
6. అమూల్ పాల సహకార సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన త్రిభువన్దాస్ కిషిభాయ్ పటేల్
7. సూరియ జుగ్రూంగ్రియాంగ్కిట్
8. కమలా పెర్సాద్ బిస్సేసర్
9. ప్రముఖ అస్సామీ కవి నీలిమ్ కుమార్
10. ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్