పర్యావరణ ప్రాధాన్యం ఉన్న చిత్తడి నేలలకు రామ్సార్ స్థలాలుగా గుర్తింపును ఇస్తారు. ఇటీవల భారత్కు చెందిన మూడు ప్రదేశాలకు ఈ గుర్తింపు లభించింది. అవి ఏవి?
ఆగస్ట్ 16 నాడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈఓఎస్ 08 అనే 175.5 కిలోల భూ పరిశీలక ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. దీనికోసం ఏ వాహకనౌకను ఉపయోగించారు?
ఇండియన్ ఆర్మీ 20వ అధిపతిగా సేవలందించిన సైనిక అధికారి ఇటీవల మరణించారు. ‘ఆపరేషన్ పరాక్రమ్’ లాంటి కీలక సమయంలో భారత సైన్యాన్ని నడిపించిన ఆ అధికారి ఎవరు?
ప్రకృతి విపత్తుల్లో పిడుగుపాటు ఒకటి. వీటి కారణంగా ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నష్టాన్ని నివారించడానికి ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై లక్షల తాటిచెట్లను పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రం ఏది?
ప్రతిష్ఠాత్మక యూరోపియన్ బాస్కెట్ బాల్ లీగ్లో ఆడే అవకాశం దక్కించుకున్న తొలి భారతీయుడిగా వార్తల్లో నిలిచిన ఆటగాడు ఎవరు?
నైతిక ఉల్లంఘనకు పాల్పడి ఆగ్నేయ ఆసియా దేశం థాయ్లాండ్ ప్రధాని స్రెట్టా థావిసిన్ రాజీనామా చేశాడు. ఆయన స్థానంలో ఆ దేశానికి ఓ మహిళ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆమె పేరేంటి?
ఒడిశా తీరంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) సుఖోయ్ 30ఎంకే1 వేదికగా సుదూర లక్ష్యాలపై దాడిచేసే సామర్థ్యం కలిగిన లాంగ్ రేంజ్ ైగ్లెడ్ బాంబును విజయవంతంగా పరీక్షించింది. దీని పేరేంటి?
ఆగస్ట్ 16న 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు. వీటిలో ఉత్తమ భారతీయ చిత్రంగా ఏ సినిమా నిలిచింది? ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన సినిమా ఏది?
టీ20 క్రికెట్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డు 17 ఏండ్ల క్రితం నమోదైంది. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరుమీద ఉన్న ఈ రికార్డును ఇటీవల సమోవా దేశానికి చెందిన ఆటగాడు బద్దలుకొట్టాడు. అది ఎవరు?
ఇటీవల అమెరికాకు చెందిన ఓ మహిళ 7.90 సెంటీమీటర్ల వెడల్పయిన నాలుకతో ప్రపంచంలోనే వెడల్పయిన నాలుక కలిగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సాధించింది. ఆమె ఎవరు?