కొబ్బరి కాయ
ఆ రోజు బడిలో సరస్వతీ పూజ. పట్టు పావడ, జాకెట్టు ధరించిన పద్మ, పుస్తకాలు చేత బట్టుకుని బడికి వెళ్లింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ‘సరస్వతీ నమస్తుభ్యం’ లాంటి పద్యాలుపాడి.. పూజ చేశారు. చివరిగా టెంకాయ కొట్టే కార్యక్రమం వచ్చింది.
అల్లరి
ఆ రోజు బడిలో సరస్వతీ పూజ. పట్టు పావడ, జాకెట్టు ధరించిన పద్మ, పుస్తకాలు చేత బట్టుకుని బడికి వెళ్లింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ‘సరస్వతీ నమస్తుభ్యం’ లాంటి పద్యాలుపాడి.. పూజ చేశారు. చివరిగా టెంకాయ కొట్టే కార్యక్రమం వచ్చింది. పదో తరగతి చదివే పిల్లలు ఒక్కొక్కరుగా టెంకాయ కొడుతున్నారు. కొద్దిసేపటికి పద్మ వంతు వచ్చింది. గట్టిగా కళ్లు మూసుకుని.. సరస్వతీ దేవిని తలుచుకుని టెంకాయ కొట్టింది. ఆ కాయ లోపల చెడిపోయి ఉంది. దాంతో, పద్మ ముఖం వాడిన మల్లె మొగ్గ అయ్యింది. బాధగా వెళ్లి దూరంగా ఉన్న మామిడిచెట్టు కింద ఏడుస్తూ కూర్చుంది. ఇదంతా చూసిన సైన్స్ టీచర్ పద్మ దగ్గరికి వెళ్లి నిలబడింది. ఎందుకు ఏడుస్తున్నావని అడిగింది. ‘నేను కొట్టిన టెంకాయ చెడి పోయింది’ అని బాధగా బదులిచ్చింది పద్మ.
టీచర్ ప్రేమగా పద్మ ముఖాన్ని లేపి.. ‘అది నువ్వు కొట్టాక చెడిందా? లేక చెడిన టెంకాయను నువ్వు కొట్టావా?’ అని ప్రశ్నించింది. ‘నేను కొట్టాక చెడలేదు. అప్పటికే అది చెడిపోయి ఉంది’ అని బదులిచ్చింది పద్మ. ‘అయితే, అది నీ తప్పు కాదుకదా! చెడిపోయి ఉన్న టెంకాయను ఎవరు కొట్టినా అంతే! కాబట్టి, నువ్వు బాధపడొద్దు. వచ్చి మరో టెంకాయ కొట్టు’ అని పిలిచింది. కన్నీళ్లు తుడుచుకుంటూ వచ్చి మరో టెంకాయ కొట్టింది పద్మ. అది చక్కగా పగిలింది. దానిలోపల తెల్లటి పువ్వు ఉంది. పద్మ ముఖం విరిసిన మల్లె మొగ్గ అయ్యింది.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు
పెద్దల మాట
వెలుగుతున్న ఒక్క దీపం.. వెయ్యి దీపాలను వెలిగించగలదు. అలాగే, ఏదైనా నేర్చుకున్నవాడే ఇతరులకు నేర్పించగలడు.
– మహాత్మా గాంధీ.
చెప్పుకోండి
నీటి ఒరుగు. రాతి బురద?
– ఉప్పు, సున్నం
దాని పువ్వు పూజకు రాదు. దాని ఆకు దొప్పకు రాదు. దాని పండు అందరూ కోరు?
– చింతపండు
పొట్టలో వేలు, నెత్తి మీద రాయి?
– ఉంగరం
పద్యం – భావం
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
బైట కుక్క చేత భంగ పడును
స్థానబల్మిగాని తన బల్మిగాదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: నీళ్లలో ఉండే మొసలి చిన్నగా ఉన్నప్పటికీ, ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపగలదు. కానీ, ఆ మొసలి తన స్థానమైన నీటి నుంచి బయటికి వచ్చినపుడు.. కుక్క చేతిలోనూ ఓడిపోతుంది. మొసలికి ఆ బలం స్థానం వల్ల వచ్చిందే కానీ, తన సొంత బలం కాదు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

