ఇంగ్లిష్ మీడియం చదువులు పరిచయం కాకముందు పిల్లలు మాటలు నేర్చినప్పటినుంచి తెలుగులోనే చిట్టిపొట్టి పాటలు పాడుకుని ఆనందించేవాళ్లు. చుక్‌చుక్ రైలు వచ్చింది, చిట్టి చిలుకమ్మ, వానా వానా వల్లప్పా లాంటిపాటలు పిల్లలకు పరిచయమై ఉండేవి. ఇప్పుడు ఇంగ్లిష్ రైమ్స్ తప్ప… పాత బాల గేయాలు అంతగా వినిపించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో నిజామాబాదుకు చెందిన ఉపాధ్యాయుడు చింతల శ్రీనివాస గుప్త నేటి బాలల కోసం వంద బాల గేయాలను కూర్చి ‘చిగురింతలు’ పుస్తకం వెలువరించారు. ఇందులోని గేయాలు లయబద్ధంగా సాగుతూ పిల్లలకే కాదు పెద్దలకూ పులకింతలు పెడతాయి. ఉదాహరణకు ‘తల్లిసేవ’ గేయంలో ఊయలలో ఉన్న చిట్టిచెల్లిని పెద్దవారైన సోదరినో, సోదరుడో ఆనందంగా వర్ణిస్తున్న సందర్భం సహజంగా అనిపిస్తుంది.
‘తోట’ గేయం పిల్లలు సీతాకోకచిలుకలుగా, కోతులుగా, చిలుకలుగా, ఉడుతలుగా మారిపోయి సంబురపడే సన్నివేశాన్ని కండ్లకు కడుతుంది. చిన్నారులతో ‘వారములు’ చదివిస్తే వారాలను సరదాగా గుర్తుంచుకుంటారు. లెక్క పెట్టడం నేర్చుకోవడంలో చింతగింజల ప్రాధాన్యాన్ని ‘చింతగింజలు’ గేయం చక్కగా వివరిస్తుంది. ఇక ‘లీలలు’ గేయం జో అచ్యుతానం జోజో ముకుందా శైలిలో సాగుతూ పిల్లలకు శ్రీకృష్ణుని బాల్య లీలలను వివరిస్తుంది. ‘మొక్కలు’ గేయం పుట్టినరోజునాడు కనీసం ఒక మొక్కయినా నాటాలని పర్యావరణ పరిరక్షణ సందేశం ఇస్తుంది. శ్రీనివాస గుప్త రాసిన ఈ చిన్ని పుస్తకం ఇప్పటి తరం తెలుగు బాలలకు అవసరమైన పదసంపదను, భాష, విషయ పరిజ్ఞానాన్ని చిట్టిపొట్టి పదాల్లో అందిస్తుంది. బాధ్యతగా మెలిగే విధానాన్ని నేర్పిస్తుంది
రచన: చింతల శ్రీనివాస గుప్త
పేజీలు: 102; ధర: రూ. 150
ప్రచురణ: శ్రీ మణిరామా పబ్లికేషన్స్
ప్రతులకు: ఫోన్: 94400 37125
అప్పగింతలు
రచన: చలపాక ప్రకాష్
పేజీలు: 124;
ధర: రూ. 125
ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌస్ శాఖలు
ఫోన్: 92474 75975
రచన: సుంకరి కృష్ణప్రసాద్
పేజీలు: 134;
ధర: రూ. 60
ప్రతులకు: ఫోన్: 94928 84122
రచన: బాలం వెంకట్రావు
పేజీలు: 118;
ధర: రూ. 90
ప్రతులకు: ప్రముఖ పుస్తకాల దుకాణాలు 99892 67426