మీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకునేందుకు.. ఆ ఒకే ఒక్క ఛాన్స్ వీళ్లు ఇప్పిస్తారు.. !!
Casting Bay | ఒక్క అవకాశం.. సినిమాల్లో నటించడమే జీవిత లక్ష్యంగా ఉన్నవాళ్లు తరచూ అనే మాట ఇది.ఆ ఒక్క అవకాశం తలవని తలంపుగా మీ తలుపు తడితే..! ‘ఏడుకొండలు ఏసీ చేస్తా.. యైత్ వండర్ నీ గుడి చేస్తా’ అని పాట ఎత్తుకుంటారు.అలాంటి ‘ఒక్క అవకాశం’ కల్పిస్తున్నది ‘కాస్టింగ్ బే’ సంస్థ. కొత్తవారికే కాదు, ఇండస్ట్రీలో ఏండ్ల కిందట పాతుకుపోయిన అనామక నటులకు కూడా మంచి బ్రేక్ ఇస్తున్నది. ‘కాస్టింగ్ బే’ కహానీ చదివేయండి మరి.
అది వెండితెరపై విడుదలయ్యే సినిమా అయినా, ఓటీటీలో ప్రసారమయ్యే వెబ్‌సిరీస్ అయినా.. కథను రక్తికట్టించేలా నడిపించే కథనం కావాలి. కథనాన్ని అద్భుతంగా పండించే నటీనటులు కుదరాలి. అప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు. నాయికానాయకుల మాట అటుంచితే, చిన్న పాత్రే అయినా కథను మలుపు తిప్పగలిగితే.. ఆ పాత్ర పోషించిన నటుణ్ని ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అలాంటి గుర్తించదగ్గ పాత్రల్లో కొత్తవారిని పరిచయం చేస్తూ సినీవినీల ఆకాశంలో సరికొత్త తారలా తళుక్కుమనిపిస్తున్నారు ‘కాస్టింగ్ బే’ నిర్వాహకులు అభిషేక్ బెనర్జీ, అన్మోల్ అహూజా.

అదిరిపోయే అవకాశం
కొన్నాళ్ల కిందట ఓటీటీలో ప్రసారమైన ‘పంచాయత్’ వెబ్‌సిరీస్‌లో చిన్నచిన్న పాత్రలు ఎన్నో కనిపించాయి. అందులో ఒకటి ఉపసర్పంచ్ ప్రహ్లాద్ పాండే. ఆయనకు అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ పాత్రలో సహజంగా నటించిన ఫైజల్ మాలిక్ కామెడీ టైమింగ్ అందరినీ అలరించింది. ఇటీవల విడుదలైన ‘పంచాయత్ 2’ వెబ్‌సిరీస్‌లో అదే పాత్రధారుడి పరిణతి చెందిన నటనకు అందరూ ఫిదా అయ్యారు. దేశరక్షణలో ప్రాణాలు వదిలిన కొడుకుకు అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో ఫైజల్ నటన ఆయనను స్టార్స్ సరసన నిలబెట్టింది. ఫైజల్‌కు, కాస్టింగ్ బేకు సంబంధం ఏమిటనే కదా మీ సందేహం? ప్రహ్లాద్ పాండే పాత్రకు ఏరికోరి ఫైజల్‌ను ఎంపిక చేసింది కాస్టింగ్ బే జోడీనే. ఫైజల్ చిన్న నిర్మాత. చిన్నాచితకా సినిమాల్లో నటించాడు కూడా! “పంచాయత్ నిర్దేశకులు ఉపసర్పంచ్ పాత్ర తీరుతెన్నులు చెప్పడంతోనే, మాకు ఫైజల్ మాలిక్ అయితే ఈ పాత్రకు న్యాయం చేయగలడని అనిపించింది. ఆయన ఓ పట్టాన ఒప్పుకోలేదు. చాలాసేపు నచ్చజెప్పిన మీదట అంగీకరించారు’ అని చెప్పుకొచ్చారు అన్మోల్ అహూజా.
పాత్రోచితమైన ఎంపిక
పాత్రోచితమైన నటులను ఎంపిక చేయగలిగితే సదరు ప్రాజెక్ట్ సగం సక్సెస్ అయినట్టే. అందుకోసమే దర్శకులు తమ చిత్రాల్లోని పాత్రల కోసం వేలాది మందిని జల్లెడపట్టి నటీ
నటులను ఎంపిక చేస్తారు. ఈ పనిని తేలిక చేయడానికి ‘కాస్టింగ్ బే’ లాంటి సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ‘జూనియర్ ఆర్టిస్ట్‌లను సప్లయ్ చేసే సంస్థలు చాలా ఉంటాయి. మేం మాత్రం నటీనటుల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాం. దర్శకుడు కథ, అందులో తనకు ఏఏ పాత్రలు కావాలో చెబుతాడు. మేము పాత్రకు సరిపోయే నటుల కోసం వేట మొదలుపెడతాం. కొత్తవారిని ఎంపిక చేస్తుంటాం, ఇప్పటికే ఉన్న నటులనూ సంప్రదిస్తాం. కావాల్సిందల్లా, ఫలానా పాత్రకు ఎవరు పరిపూర్ణంగా న్యాయం చేయగలరో వారిని ఎంపిక చేయడం. ఫొటో షూట్లు, డైలాగ్ టెస్టింగ్.. ఇలా ఎన్నో పరీక్షలు నిర్వహించి, నటీనటులను ఎంపిక చేస్తాం’ అంటాడు అభిషేక్.

మున్నాభాయ్ టు గుడ్డూ భయ్యా
ఒకప్పుడు ‘అలాంటి పాత్రకు ఆయన, ఇలాంటి పాత్రకు ఈయన’ అని గుడ్డిగా ఎంపిక చేసేవాళ్లు. ఆ పద్ధతులు ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదు. ‘ప్రస్తుతం రోజుకో కొత్త నటుడు తెరకు పరిచయం అవుతున్నాడు. అనామక పాత్రనూ అత్యద్భుతంగా పోషించే నటులు అందుబాటులో ఉన్నారు. అలాంటి వారిని ఎంపిక చేయడంలో కిక్ ఉందంటారు కాస్టింగ్ బే నిర్వాహకులు. అత్యంత ప్రజాదరణ పొందిన ‘మీర్జాపూర్’ వెబ్‌సిరీస్‌లో మున్నా త్రిపాఠిగా దివ్యేందు, గుడ్డూ భయ్యాగా అలీ ఫజల్ ఎంపిక కూడా ‘కాస్టింగ్ బే’ ఖాతాలోదే. ఈ రెండు పాత్రలు ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పాతాల్‌కోట్’ వెబ్‌సిరీస్‌లో పోలీస్ అధికారి హాథీరామ్ చౌధురీ పాత్రధారి జయ్దీప్ని ఎంపిక చేసింది కూడా ఈ ద్వయమే. దర్శకత్వ శాఖకు భారం తగ్గిస్తున్న ఈ టాలెంట్ ఏజెన్సీ పుణ్యమా అని ‘ఒక్క అవకాశం’ కోసం ముంబై వీధుల్లో తిరుగుతున్న ఎందరో ఆశావహులకు అదృష్టం కలిసివస్తున్నది.
Read More :
టాలెంట్ ఉండి.. కష్టపడితే సినిమాల్లో రేపటి స్టార్స్ మీరే.. అందుకు వీళ్లే ప్రూఫ్ !!
ఒకవైపు యాక్టింగ్.. మరోవైపు స్టార్టప్స్.. సైడ్ బిజినెస్‌లతో దూసుకెళ్తున్న టాలీవుడ్ స్టార్స్..
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

