కావలసిన పదార్థాలు : బ్రెడ్ ైస్లెస్లు: 6
అమూల్ చీజ్ క్యూబ్‌లు: రెండు లేదా మూడు
టొమాటో కెచప్: 3 టేబుల్ స్పూన్లు
క్యాప్సికమ్: 1
ఉల్లిగడ్డ: 1
ఇలాలియన్ హెర్బ్స్ మిశ్రమం
(ఓరెగనో, తులసి, పుదీన, రోజ్మేరీలాంటివి) : రెండు స్పూన్ల పొడి (దొరికితే పచ్చివి పావు కప్పు)
నెయ్యి లేదా బటర్ (అవసరమైతే) : ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం: ముందుగా చీజ్‌ను తురుముకోవాలి. క్యాప్సికమ్, ఉల్లిగడ్డలను సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ ైస్లెస్ల మీద టొమాటో కెచప్‌ను రాయాలి. ఇప్పుడు తరిగిన కూరగాయల ముక్కలను దీని మీద వేసుకోవాలి. ఇటాలియన్ హెర్బ్స్ పొడిని చల్లాలి. దీని పైన తురిమిన చీజ్ వేసి మరో బ్రెడ్‌ను పెట్టి నొక్కాలి. అందుబాటులో గీతలుండే గ్రిల్ ఉంటే దాని సాయంతో కాల్చుకోవచ్చు. లేదా పెనం మీద కొంచెం నెయ్యి లేదా బటర్ వేసి నొక్కి పెట్టి కాల్చాలి. తర్వాత నాలుగు పలకల ముక్కలుగా కోస్తే సరి… బ్రెడ్ పిజ్జా బైట్స్ లాగించేయొచ్చు!