పుస్తకంలేని ఇల్లు.. ఆత్మలేని శరీరం లాంటిది.
ట్విన్ టవర్స్ స్మారకంగా
మానవ సంబంధాల నేపథ్యంతో రాసిన రచనలు మనసుకు హత్తుకుంటాయి. మన చుట్టూ ఉన్న జీవితాలను చూసిన భావన కలిగిస్తాయి. రచయిత్రి చెరుకూరి రమాదేవి చేసిన అలాంటి ప్రయత్నమే ‘ట్విన్ టవర్స్’ నవల. రఘురామ్, కళ్యాణి, చంద్రమౌళి ఇందులోని ప్రధాన పాత్రలు. గొప్ప శాస్త్రవేత్త కావాలని కలలుగనే యువకుడు రఘురామ్. ఆత్మగౌరవం ఉన్న యువతి కళ్యాణి. నెల రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన రఘురామ్‌తో, ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాలనుకునే కళ్యాణి వివాహం జరుగుతుంది. కళ్యాణితో కొద్దిరోజులే కలిసి ఉంటాడు రఘురామ్. కళ్యాణిని వదిలి అమెరికా వెళ్లిన రఘురామ్.. మళ్లీ తిరిగిరాడు. తన చదువులు, పరిశోధనలతో కళ్యాణిని పూర్తిగా మర్చిపోతాడు.
కళ్యాణికి బిడ్డ పుడతాడు. పేరు చంద్రమౌళి. తెలివితేటల్లో తండ్రి రఘురామ్ పోలిక. ఐఐటీలో చదివి అమెరికా వెళ్తాడు చంద్రమౌళి. కొడుకు పెండ్లి కోసం వెళ్లిన కళ్యాణికి అమెరికాలో శాస్త్రవేత్తగా రఘురామ్ కనిపిస్తాడు. వ్యక్తిగా అతను సాధించిన విజయాలకు గర్వించినా, అన్యాయంగా తనను వదిలేసిన భర్తగా ద్వేషిస్తుంది కళ్యాణి. తను చేయని తప్పునకు వైవాహిక బంధంలో ఒంటరైన కళ్యాణి అంతర్మథనం పాఠకుల మనసు మెలిపెడుతుంది.
అమెరికాలో రఘురామ్‌ను కళ్యాణి కలుసుకుందా? తండ్రి గురించి తెలిసిన చంద్రమౌళి ఎలా స్పందించాడు? వీరి జీవితాల్లో ట్విన్ టవర్స్‌పై జరిగిన ఉగ్రదాడి ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చింది? అనేది ఈ పుస్తకం ముగింపు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మగౌరవం, హుందాతనం కోల్పోని కళ్యాణి పాత్రచిత్రణ ఆకట్టుకుంటుంది. ప్రతి పాత్ర, సందర్భం మన కళ్లముందు కదలాడిన అనుభూతిని కలిగించడంలో రమాదేవి ప్రతిభ కనిపిస్తుంది.
ట్విన్ టవర్స్
రచన: చెరుకూరి రమాదేవి
పేజీలు: 556; ధర: రూ. 500
ప్రచురణ: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
ప్రతులకు: ఫోన్: 80963 10140
బుక్ షెల్ఫ్జూన్ 2, 2014
రచన: కోడం పవన్‌కుమార్
పేజీలు: 159,
ధర: రూ. 125
ప్రచురణ: లయ పబ్లికేషన్స్
ప్రతులకు:
ఫోన్: 98489 92825
నీరడి మడి
రచన: కూతురు రాంరెడ్డి
పేజీలు: 191,
ధర: రూ. 175
ప్రచురణ: కూతురు ప్రచురణలు
ప్రతులకు:
ఫోన్: 90004 15353
కాలంతో పాటు..
రచన: ఎస్ ఎం సుభాని
పేజీలు: 128,
ధర: రూ. 150
ప్రతులకు:
ఫోన్: 94907 76184