BMW Z4 M40i Roadster | భారత్ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ అప్డేటెడ్ జడ్4 ఎం40ఐ రోడ్‌స్టర్.. 4.5 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్ దీని స్పెషాలిటీ..!
BMW Z4 M40i Roadster | ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారత్ మార్కెట్లోకి మరో లగ్జరీ కారు జడ్4 ఎం40ఐ అప్ డేటెడ్ కారు ఆవిష్కరించింది. దీని ధర రూ.89.30 లక్షల నుంచి మొదలవుతుంది.
BMW Z4 M40i Roadster | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా.. తన అప్డేటెడ్ బీఎండబ్ల్యూ జడ్4 ఎం40ఐ రోడ్‌స్టర్ (BMW Z4 M40i Roadster) దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. భారత్ మార్కెట్లోకి కేవలం పెట్రోల్ వేరియంట్ మాత్రమే తీసుకొచ్చింది. దీని ధర రూ.89.30 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
బీఎండబ్ల్యూ జడ్4 ఎం40ఐ రోడ్‌స్టర్ (BMW Z4 M40i Roadster) కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. వచ్చే నెల నుంచి దేశంలోని బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌ల వద్ద ఈ కార్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే ఈ కారు మీద రెండేండ్ల వారంటీ లభిస్తుంది. కేవలం 4.5 సెకన్లలో 100 కి.మీ. స్పీడ్ అందుకోగలగడం దీని స్పెషాలిటీ.
బీఎండబ్ల్యూ జడ్4 ఎం40ఐ (BMW Z4 M40i Roadster) కారు 2998 సీసీ – 3.0 లీటర్లు, సిక్స్ -సిలిండర్ ఇంజిన్ తో వస్తున్నది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 335 బీహెచ్పీ విద్యుత్, 500 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఇది మూడు డ్రైవింగ్ మోడ్స్ (ఎకోప్రో, కంఫర్ట్, స్పోర్ట్)లో లభిస్తుంది. లీటర్ పెట్రోల్ మీద 12.095 కి.మీ. మైలేజీ ఇస్తుంది.
ఈ కారు రీ ట్రాక్టబుల్ ఫ్యాబ్రిక్ రూఫ్ కలిగి ఉంటుంది. కేవలం 10 సెకన్లలో ఓపెన్ చేయొచ్చు.. మూసేయవచ్చు. దీంతోపాటు న్యూ కిడ్నీ గ్రిల్లె విత్ హరిజొంటల్ ఇన్నర్ స్ట్రక్చర్ డిజైన్, లార్జ్ ఎయిర్ ఇన్ టేక్, న్యూ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, సాఫ్ట్-టాప్, ఫ్రంట్ వీల్ ఆర్చి చుట్టూ న్యూ ఎయిర్ వెంట్స్ , రేర్ స్పాయిలర్, రేర్ బంపర్ మీద డిఫ్యూజర్, డ్యుయల్ ఎగ్జాస్ట్ పైప్ వంటి ఫీచర్లు డిజైన్ చేశారు.
వీటితోపాటు 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్యాబిన్లో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ ప్లే ఫీచర్లు కూడా ఉంటాయి. యాక్టివ్ పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, రేర్ వ్యూ కెమెరా, డ్రైవింగ్ అసిస్టెంట్ ఫంక్షన్ వంటి ఫీచర్లు జత చేశారు.
కారులో ప్రయాణించే వారి సేప్టీ కోసం ప్రత్యేకించి డ్రైవర్, ప్యాసింజర్ లకు ఫ్రంట్ అండ్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) విత్ బ్రేక్ అసిస్ట్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (సీబీసీ), డైనమిక్ బ్రేక్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

