e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home బతుకమ్మ హలో డాక్టరమ్మా.. హార్టు మిస్సాయే!

హలో డాక్టరమ్మా.. హార్టు మిస్సాయే!

హలో డాక్టరమ్మా.. హార్టు మిస్సాయే!


‘పెళ్ళిసందడి’ అనగానే తెలుగు సినీ అభిమానులకు చాలా జ్ఞాపకాలు మదిలోమెదులుతాయి. అంతగా మనసుల్నికట్టి పడేసిన ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్నది ‘పెళ్ళిసంద D’.
ఈ సినిమాద్వారా తెలుగుతెరకు పరిచయమవుతున్న కన్నడభామ.. శ్రీలీల.టాలీవుడ్‌లో అరంగేట్రంతోనే అద్భుత అవకాశం దక్కింది. కన్నడ, తెలుగు సినీ పరిశ్రమల మధ్య భాష,
ప్రాంతం మినహా చెప్పుకోదగిన తేడా ఏం లేదంటూ శ్రీలీల పంచుకున్న ముచ్చట్లు..

 • మేంతెలుగువాళ్లమే.బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబం మాది.నాకు తెలుగు రుచులు తెలుసు,తెలుగు ప్రేక్షకుల అభిరుచులూ తెలుసు.నేను అమెరికాలోని డెట్రాయిట్‌లో పుట్టాను. ప్రస్తుతం మెడిసిన్‌ చదువుతున్నా. చిన్నప్పటినుంచీ సినిమాలంటే ఇష్టం. ఎంతోమంది
  హీరోలను, హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన రాఘవేంద్రరావుగారి పర్యవేక్షణలో రూపొందుతున్నసినిమాద్వారా, టాలీవుడ్‌లో తొలి అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం నా కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది.
 • సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబం మాది. సినిమాల్లో నటిస్తానంటే ఒప్పుకోలేదు. కానీ, నా ఆసక్తి, పట్టుదల చూసి చివరికి సరేనన్నారు. కన్నడలో హీరోయిన్‌గా నా మొదటి సినిమా ‘కిస్‌’. ఆ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. అవకాశాలు కూడా లభించాయి. వెంటనే ‘బారాత్‌’లో చాన్స్‌ దక్కింది.
 • స్విమ్మింగ్‌, హాకీ, క్లాసికల్‌, బాలే డాన్స్‌లలోనూ ప్రావీణ్యం ఉంది.లాక్‌డౌన్‌ సమయాన్ని కొత్త
  విషయాలు నేర్చుకోవడానికి వినియోగించుకున్నా. అన్ని భాషల సినిమాలూ చూస్తూ, ప్రాంతాలవారీగా సినిమాల ప్రత్యేకతలు గమనిస్తున్నా. సంగీతం అంటే నాకు ఇష్టం.
  మంచి మ్యూజిక్‌ మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది, ఉత్తేజపరుస్తుంది.
 • ప్రస్తుతం కన్నడలో ధన్వీరాతో ‘బై 2 లవ్‌ విత్‌’, ధ్రువ సార్జాతో ‘దుబారీ’ సినిమాల్లో నటిస్తున్నాను.
  తెలుగులో రవితేజ సినిమాలో అవకాశం వచ్చింది. రెండో సినిమానే అంత పెద్ద హీరో పక్కన అంటే, మొదట అస్సలు నమ్మలేదు. ‘నన్నే అడుగుతున్నారా’ అనిపించింది. తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. కథలు వింటున్నా. అయితే, ఇంకా ఫైనల్‌ కాలేదు.తెలుగుతోపాటు తమిళ, మలయాళ పరిశ్రమల్లోనూ నటించి మంచినటిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. డాక్టర్‌ చదువుకూడా పూర్తి చేస్తా. పేరు పక్కన ఆ మూడక్షరాలతో వచ్చే హుందాతనమే వేరు.
 • భాష, ప్రాంతం తప్పిస్తే తెలుగు,కన్నడ పరిశ్రమలకు పెద్ద తేడా లేదు.‘పెళ్ళి సంద D’ సెట్లో చాలామంది కన్నడలోనే మాట్లాడారు. దాంతో పరాయి ప్రాంతంలో ఉన్నాననే భావనే
  కలుగలేదు. పైగా ఇక్కడి వాతావరణాన్ని, మనుషుల్ని చూసిన తర్వాత తెలుగు పరిశ్రమలోకి లేట్‌గా
  వచ్చి చాలా మిస్సయ్యానేమో అనిపించింది. హైదరాబాద్‌ వాతావరణమే కాదు, ఆహారమూ నాకు నచ్చింది.
 • కొవిడ్‌ టైమ్‌లో షూటింగ్‌ పెట్టుకున్నా సకల జాగ్రత్తలూ తీసుకున్నాం. మాస్క్‌లు, శానిటైజర్లు,
  భౌతిక దూరం వంటి నియమాలన్నీ పాటించాం. ఇదివరకు ‘నిర్మలా కాన్వెంట్‌’
  సినిమాలో చేసినా, పూర్తిస్థాయి హీరోగా రోషన్‌కి ఇదే మొదటి సినిమా. మా ఇద్దరికీ ఈ చిత్రంతో మంచి అవకాశాలు దక్కాలనీ, పరిశ్రమలో స్థిరమైన స్థానం లభించాలనీ కోరుకుంటున్నా.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హలో డాక్టరమ్మా.. హార్టు మిస్సాయే!
హలో డాక్టరమ్మా.. హార్టు మిస్సాయే!
హలో డాక్టరమ్మా.. హార్టు మిస్సాయే!

ట్రెండింగ్‌

Advertisement