తూర్పుదిక్కున ఉయ్యాలో..
తులసి వాన కురిసె ఉయ్యాలో..
పడమటి దిక్కున ఉయ్యాలో..
పాలవాన కురిసె ఉయ్యాలో..
ఆ వాన ఈ వాన ఉయ్యాలో..
చెరువు నిండిపాయే ఉయ్యాలో..
చెరువు నిండిపాయె ఉయ్యాలో..
కట్ట దెగిపాయే ఉయ్యాలో..
కట్టమీది మైసమ్మ ఉయ్యాలో..
ఏమని వరమడిగె ఉయ్యాలో..
నీ పెద్ద కొడుకును ఉయ్యాలో..
ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
పెద్దకొడుకునిస్తె ఉయ్యాలో..
పేరుకెవ్వరు లేరు ఉయ్యాలో..
నీ నడిపి కొడుకును ఉయ్యాలో..
ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
నడిపి కొడుకునిస్తె ఉయ్యాలో..
నడకకెవ్వరు లేరు ఉయ్యాలో..
నీ చిన్న కొడుకును ఉయ్యాలో..
ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
చిన్నకొడుకుస్తె ఉయ్యాలో..
చిలిపికెవ్వరు లేరు ఉయ్యాలో..
నీ పెద్ద కోడల్ని ఉయ్యాలో..
ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
పెద్ద కోడల్నిస్తె ఉయ్యాలో..
ఇంటి బాధ్యతలెట్ల ఉయ్యాలో..
నీ నడిపి కోడల్ని ఉయ్యాలో..
ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
నడిపి కోడల్నిస్తె ఉయ్యాలో..
నారుమడులెట్ల ఉయ్యాలో..
నీ చిన్న కోడలి ఉయ్యాలో..
ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
చిన్న కోడల్నిస్తె ఉయ్యాలో..
ఇంటి పనులెట్ల ఉయ్యాలో..
ఇంకా ఉంది..
పాడినవారు : దయ్యాల భాగ్య
సెల్ నెం : 76598 50362 (గూడూరు, మహబూబాబాద్)
జిందగీలో.. పాటల పల్లకి!
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి..
ఎన్నో బతుకమ్మ పాటలు వినండి.
..పూర్తి పాట వినడానికి స్కాన్ చేయండి.