ఈ రోజుల్లో సాధారణ తాళాలు అంత సురక్షితం కాదు. మహామహా బ్రాండ్లకు కూడా డూప్లికేట్ కీ తయారైపోతున్నది. అందుకే, ఎప్పుడూ ఇంటి తలుపుపై ఓ కన్ను ఉండేలా సీసీటీవీలు, స్మార్ట్ లాక్‌లు వచ్చేశాయి. ఇప్పుడు మరింత స్మార్ట్‌గా.. రీ స్పిల్ట్ స్మార్ట్ లాక్‌ను తీసుకొచ్చింది హాఫెల్ సంస్థ. ఈ స్మార్ట్ లాక్‌ను యాప్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది. దీంతో లాక్ చేయడానికి నంబర్ పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్‌తోపాటు అత్యాధునిక బ్లూటూత్ (బీటీ) కీ సౌకర్యం కూడా ఉంది. అన్నిరకాల తలుపులకు వినియోగించవచ్చు. ఈ స్మార్ట్ లాక్ ధర రూ.70,000.
వివరాలకు hafeleindia.com
చూడవచ్చు.