Ananya Raj | ఉత్తరాది భామలంతా బాలీవుడ్లో ప్రయత్నిస్తూనే టాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. వెబ్ సిరీస్‌లు, సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న మరో ఉత్తరాది భామ అనన్య రాజ్. ‘సెవెన్ అవర్స్ టు గో’, ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’, ‘ఘోస్ట్’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిందీ హాట్ బ్యూటీ. నవీన్‌చంద్ర ‘తగ్గేదే లే’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నది. సినిమాల్లో నటించాలనే బలమైన కోరికతో పరిశ్రమలోకి అడుగుపెట్టి అనేక అవరోధాలను ఎదుర్కొన్నానంటూ అనన్య పంచుకున్న ముచ్చట్లు..
నేను పుట్టింది గోరఖ్‌పూర్‌లో, పెరిగింది ముంబైలో. స్కూలు, కాలేజీ ఫంక్షన్లలో తప్పకుండా పాల్గొనేదాన్ని. నటన కంటే డ్యాన్స్ ఇష్టం. ప్రీతిజింటా, రాణీ ముఖర్జీ వంటి నటీమణులను చూస్తూ పెరిగాను. ప్రీతి వ్యక్తిత్వం నాకు స్ఫూర్తి. చిన్నప్పటినుంచీ నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడం ఇష్టం. కాబట్టే, ఇంటర్మీడియట్ పాస్ కాగానే యాక్టింగ్ స్కూల్లో చేరిపోయాను. నాటకాల్లో చేయడం మొదలుపెట్టాను. స్పష్టంగా పలకడం, పెద్దపెద్ద డైలాగులు చెప్పడం రంగస్థల కళాకారులకు ఇబ్బంది కలిగించే విషయాలు. కానీ, అవే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అక్కడినుంచి మోడలింగ్ వైపు వచ్చాను. ఆ తర్వాత సినిమాల్లో ప్రయత్నించాను. మొదటి రెండేళ్లూ ఒక్క అవకాశం కూడా దొరకలేదు. చాలా ఇబ్బందిపడ్డాను.
ప్రతీ పరిశ్రమ దాని అవసరాలను బట్టి అవకాశాలు ఇస్తుంది. అయితే కొత్తవారిని ప్రోత్సహించడంలో తెలుగు పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. కొత్తగా రంగంలోకి వచ్చేవారికి టాలీవుడ్ ఒక వరం. భాష ఏదైనా ప్రామ్టింగ్ లేకుండా పదాలు స్పష్టంగా పలకగలను. దేవుడిచ్చిన వరం అది.
అందరూ అనుకుంటున్నట్టు, దక్షిణాదిలో పేరు తెచ్చుకోవడం అంత సులభమేం కాదు. భాష తెలియకుండానే రాణించిన కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను, తమన్నా నిజంగా గొప్పవాళ్లు. దక్షిణాదితోపాటు బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేదే నా ఆశయం.
బయోపిక్‌లు చేయాలని ఉంది. అదంత తేలిక కాదని తెలుసు. అయినా తేలికైన పనులు చేస్తూ పోతే మనకంటూ ఏ ప్రత్యేకతా ఉండదు. నిజానికి మా అమ్మ నటి కావాలనుకుంది. కానీ తల్లిదండ్రులు ప్రోత్సహించలేదు. ఆమె కలను నేను నెరవేరుస్తున్నా. ప్రస్తుతం రెండు సినిమాలు, హాట్‌స్టార్ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా. ఒక మ్యూజిక్ ఆల్బమ్ కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళం, హిందీలో రాబోతున్న ‘మద్రాసీ’ అనే త్రిభాషా చిత్రంలో నటిస్తున్నా.
బాలీవుడ్‌కు, టాలీవుడ్‌కూ చాలా తేడా ఉంది. అక్కడ సెట్స్‌లో ఏదైనా వాగేస్తాం. ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోరు. ఇక్కడ మాత్రం కాస్త లౌక్యంగా ఉండాలి. ఆ ఒక్కటీ మినహాయిస్తే.. తెలుగు పరిశ్రమ చాలా నచ్చింది. ప్రపంచమంతా తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటున్న సమయంలో నేను టాలీవుడ్లో ఉండటం గర్వించాల్సిన విషయమే. ‘తగ్గేదే లే’లో నేను ఓ ఎన్నారై అమ్మాయి పాత్ర పోషిస్తున్నా. హీరో నవీన్‌చంద్ హుషారైన నటుడు.
“Ananya Panday | చురకత్తులాంటి చూపులతో హీటెక్కిస్తున్న అనన్య పాండే..”