భారీ పుష్పం భలే అందం!
ఇంట్లోకి అడుగుపెట్టగానే ఎదురుగా ఓ భారీ గులాబీ పుష్పం.. దాని చుట్టూ అల్లుకున్న పచ్చని ఆకులు! ఒక్క క్షణం ఇంట్లో ఉన్నామా? పూదోటలోకి వచ్చామా? అనిపిస్తుంది. గోడలపై చిన్నచిన్న బొమ్మలకే పరిమితమైన అలంకరణ ఇప్పుడు పెద్ద పుష్ప చిత్రాలతో సరికొత్త రూపాన్ని సంతరించుకుంటున్నది. ఖాళీ గోడను ఓ కళాఖండంలా మార్చేస్తున్న ఈ ట్రెండ్ భలేగా ఆకర్షిస్తున్నది.
గతంలో గోడలపై చిన్న చిన్న పూలు, తీగలు, ఆకుల నమూనాలు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు మాత్రం గోడలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించే భారీ పుష్ప చిత్రాలకు ప్రాధాన్యం పెరుగుతున్నది. పెద్ద గులాబీలు, విచ్చుకున్న తామరలు, కలువలు, ఆర్కిడ్లు, మందారాలు.. ఇలా ఒక్కో పుష్పాన్ని పెద్ద పరిమాణంలో చిత్రించి గోడకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తున్నారు. కొన్ని నమూనాల్లో పూలతోపాటు పొడవైన ఆకులు, సన్నని కొమ్మలు, సీతాకోకచిలుకలు కూడా ఉంటాయి. మరికొన్నిటిలో పూలను నీటిరంగుల చిత్రాల్లా మృదువుగా చూపిస్తారు. ఈ విధానం గదికి కళాత్మకమైన రూపాన్ని అందిస్తుంది.
ఒక గోడ.. ఎన్నో అందాలు!
ఈ ట్రెండ్‌లో ప్రధానమైన ప్రత్యేకత ఏమిటంటే.. ఇంటి గోడలన్నిటినీ అలంకరించాల్సిన అవసరం లేదు. హాలులో సోఫా వెనుక గోడకు భారీ పుష్ప చిత్రాన్ని అమర్చితే అది గదికి ప్రధాన ఆకర్షణగా మారుతుంది. పడకగదిలో మంచం వెనుక గోడకు లేత గులాబీ, తెలుపు, క్రీమ్ రంగుల్లోని పూల నమూనాలు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. భోజనాల గదిలో ముదురు ఆకుపచ్చ ఆకులతో కూడిన పెద్ద పుష్ప చిత్రాలు ప్రత్యేకమైన అందాన్ని తెస్తాయి.

Flowers 3
పెద్ద పూల చిత్రాల అందం వాటి పరిమాణంలోనే కాదు.. రంగుల కలయికలోనూ ఉంటుంది. తెల్లని గోడపై గులాబీ, పీచ్, లేత పసుపు రంగుల పూలు మృదువైన అందాన్ని ఇస్తాయి. ముదురు ఆకుపచ్చ ఆకులతో కూడిన పుష్ప చిత్రాలు సహజత్వాన్ని ప్రతిబింబిస్తాయి. నీలం, ద్రాక్షరంగు, ఎరుపు ఛాయలతో రూపొందించిన నమూనాలు గోడను ఘనంగా కనిపించేలా చేస్తాయి. గది చిన్నదైతే లేత రంగులు, గోడపై ఇప్పటికే ఎక్కువ అలంకరణ ఉంటే సరళమైన పుష్ప నమూనాలు ఎంచుకోవడం మంచిది.
స్టిక్కరా.. గోడచిత్రమా…
ఈ ఓవర్ సైజ్డ్ వాల్ స్టిక్కర్స్ రెండు వెరైటీల్లో లభిస్తాయి. విడివిడిగా అతికించుకునే పూల స్టిక్కర్లు ఒక రకం. గోడపై పెద్ద చిత్రంలా అమర్చే వాల్ మ్యూరల్స్ మరో రకం. మొదటి విధానంలో మనకు నచ్చిన చోట పూలను అమర్చుకోవచ్చు. రెండో విధానంలో మొత్తం గోడకు ఒకే చిత్రాన్ని అతికించవచ్చు. గోడ పరిమాణానికి సరిపోయే నమూనాను ఎంచుకోవడం, అతికించే ముందు గోడను శుభ్రం చేయడం, తొలగించినప్పుడు గోడ రంగు దెబ్బతినకుండా ఉండే నాణ్యతను పరిశీలించడం అవసరం.

Flowers 4
పూల ప్రపంచం!
గోడలపై పెద్ద పుష్ప చిత్రాలు అలంకరణకే పరిమితం కావు. ఇంటి వాతావరణానికి మన అభిరుచిని జోడించే అవకాశం కూడా ఇస్తాయి. ఖరీదైన చిత్రాలు కొనాల్సిన అవసరం లేకుండానే, చిన్న మార్పుతో ఇంటికి కొత్త రూపాన్ని తీసుకురావచ్చు. ప్రకృతిని ప్రేమించేవారికి, రంగులను ఇష్టపడేవారికి ఈ అలంకరణ ఓ అందమైన అవకాశం. గోడపై ఓ పెద్ద పుష్పం.. ఇంటి మొత్తానికి కొత్త కళను అద్దగలదన్నదే ఈ అలంకరణలోని ప్రత్యేకత.

Flowers

Flowers 1
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

