శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Feb 09, 2020 , 01:13:25

వ్యక్తి ‘గతం’

వ్యక్తి ‘గతం’

అమిత్‌.. హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఇక్కడ ఉద్యోగం మానేసి బెంగళూరు వెళ్లాలనుకున్నాడు. తనకొక ఉద్యోగం చూసిపెట్టమని బెంగళూరులో ఉండే స్నేహితునికి మెయిల్‌ రాసి పంపాడు. ఆ ఫ్రెండ్‌ ఇంకా మెయిల్‌ చూడలేదు. కానీ..

అమిత్‌కు కొన్ని ప్రమోషన్‌ మెయిల్స్‌, స్పామ్‌ మెయిల్స్‌ వచ్చాయి. 

బెంగళూరుకు ఫ్లయిట్‌ టికెట్స్‌, బస్‌ టికెట్లకు సంబంధించిన ఆఫర్ల వివరాలు.. 

అక్కడి అకామిడేషన్‌, బడ్జెట్‌ హోటల్స్‌, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, జాబ్‌ ఆఫర్స్‌కు సంబంధించిన వివరాలు.. ఆ వచ్చిన మెయిల్స్‌లో ఉన్న సారాంశం. 

ఇదెలా సాధ్యం?

వాస్తవం చెప్పాలంటే.. అమిత్‌ మెయిల్‌లో రాసుకున్న వ్యక్తిగత వివరాలు సంబంధిత మెయిల్‌ ప్రొవైడర్‌కు తెలుసన్నమాట. దాని ఫలితమే ఈ అడ్వర్టయిజింగ్‌ ఈమెయిల్స్‌. 

ఇంకా నమ్మకం కుదరడం లేదా? 

మీకు యూట్యూబ్‌ రెగ్యూలర్‌గా చూసే అలవాటు ఉందా? 

అయితే ‘రెకమెండెడ్‌ ఫర్‌ యు’ అనే వీడియోలను మీరు ఎప్పుడైనా చూశారా? 

చూసే ఉంటారు. అంటే ఏంటి? మీరు ఏ వీడియోలు చూస్తున్నారో యూట్యూబ్‌కు తెలుసు. అంటే గూగుల్‌ డేటాలో మీ సమాచారం ఉందన్నమాట. మీరు ఎలాంటి వీడియోలను ఇష్టపడుతున్నారో.. ఆ సెగ్మెంట్‌లో వచ్చిన కొత్త వీడియోలను మీకు ట్యూబ్‌ చూపిస్తుందన్నమాట. ఒక్క గూగుల్‌కే కాదు.. ఇంటర్‌నెట్‌లో వ్యక్తిగత సమాచారం వెనుక పెద్ద వ్యాపారమే నడుస్తున్నది.  

మీరొక మొబైల్‌ కొందామనుకున్నారు. దాని ఫీచర్స్‌ ఏంటో, ఏ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో ఎంత తక్కువకు దొరుకుతుందో వెతికి చూశారనుకుందాం. దానికి సంబంధించిన అప్‌డేట్స్‌ మాత్రమే కాకుండా, అలాంటి ఫీచర్స్‌ ఉన్న ఫోన్ల వివరాలు తెలుపుతూ కొన్ని మెయిల్స్‌ మీకు వస్తుంటాయి ఎప్పుడైనా గమనించారా?

మీరు చూడాలనుకుంటున్న ప్రదేశాలు.. ఉండాలనుకుంటున్న హోటళ్లు.. కొనాలనుకుంటున్న వస్తువులు.. మీ అవసరాలు, అలవాట్లు, అభిరుచులు, ఆసక్తులు, ఆలోచనలు, అభిప్రాయాలు.. ఏదో ఒక రూపంలో ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఇంటర్‌నెట్‌లో కలిపేశారన్నమాట.  

అంటే.. 

మీ వ్యక్తిగతం ఎప్పుడో ‘గతం’లో కలిసిపోయింది. 

మీ గోప్యత.. గోవిందా!!.