20 years of TRS | సార్, నాకొకటి అనిపిస్తున్నది. మీరు ముందు నిర్ణయం తీసుకుని మమ్మల్ని అడుగుతుంటారు. అంతేకదా! కానీ దానివల్ల లాభమేమిటి?- అని వి.ప్రకాశ్ అడిగారొకసారి. ‘బాగా గుర్తించావు’ అని ఆయన్ని ప్రశంసించిన కేసీఆర్ దాని వెనక ఉన్న లాజిక్‌ని వివరించారు. కేసీఆర్ డెసిషన్ మేకింగ్ చాలా టిపికల్‌గా ఉంటుంది. ఒక అంశంపై నిర్ణయం తీసుకునే ముందు, దాని పర్యవసానాలు, ప్రభావాల గురించి ఆయన అనేక విధాలుగా ఆలోచిస్తారు. దీనిపై వామపక్ష వాదులైతే ఎలా ఆలోచిస్తారు? రైటిస్టులైతే ఎలా ఆలోచిస్తారు? మధ్యేవాదులైతే ఎలా ఆలోచిస్తారు? ఇలా వారిలో పరకాయ ప్రవేశం చేసి మరీ తరచి చూస్తారు. అధికారులిచ్చే ఇన్పుట్ తీసుకున్నా, క్షేత్రస్థాయి సిబ్బంది ఫీడ్‌బ్యాక్, గ్రౌండ్ లెవెల్ సమాచారంపై ఎక్కువగా ఆధారపడతారు. తనకు తానై కన్విన్స్ అయితే తప్ప తుది నిర్ణయానికి రారు. అప్పటిదాకా ఎవరికీ పెద్దగా చెప్పరు. అంతిమ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని చర్చకు పెడతారు. తద్వారా తాను తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనను గమనిస్తారు. వ్యతిరేకత వస్తే అవతలివాళ్లను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ చర్చ సమయంలో విషయంపై అవగాహనతో ఎవరేం చెప్పినా వింటారు. అనుబంధ ప్రశ్నలు, ఉప ప్రశ్నలు వేసి విషయం రాబడతారు. ఎవరు ఆమోదించినా, ఆమోదించకున్నా నిర్ణయాన్ని అమలు చేయాలనుకుంటే అమలు చేస్తారు. లాభనష్టాలకు తానే బాధ్యత వహిస్తారు.
పాల్కురికి సోమన్న, బమ్మెర పోతన్న, రామదాసు, సుకవితా పయోనిధి దాశరథి, ప్రజాకవి కాళోజీ, వానమామలై వరదాచార్య, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్య, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత ఆచార్య సి.నారాయణరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి వంటి మహామహులు తెలంగాణను సాహిత్య మాగాణంగా తీర్చిదిద్దారు.
– కేసీఆర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
trs plenary | కేసీఆర్ గురించి నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు
20 Years Of TRS | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
20 years of TRS | కేసీఆర్ రోజువారీ షెడ్యూల్ ఎలా మొదలవుతుందో తెలుసా !
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
20 years of TRS | కేసీఆర్ దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే ఏంటి?
trs plenary | భక్తిభావంలో ఆయనకు ఆయనే సాటి.. జిల్లాలు, ప్రాజెక్టులకు దేవతల పేర్లు