జిమ్‌కు వెళ్లి చెమటలు పట్టేలా వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదనీ, రోజూ ఓ గంటపాటు ‘రోయింగ్’ చేస్తే చాలన్నది ఆరోగ్య నిపుణుల మాట. గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ‘రోయింగ్’ ఉత్తమమైన వ్యాయామమని వారు చెబుతున్నారు. దానిని దృష్టిలో పెట్టుకొనే అమెరికాకు చెందిన వ్యాయామ ఉత్పత్తుల సంస్థ ‘హైడ్రో’.. సరికొత్త రోవర్‌ను తయారుచేసింది. ‘హైడ్రో ప్రొ రోవర్’ పేరుతో వచ్చిన ఈ జిమ్ పరికరం.. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు రక్త ప్రసరణను మెరుగుపరచడం, ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. దీనిపైన వ్యాయామం చేస్తే.. నీటిపై పడవలో రోయింగ్ చేసిన అనుభూతిని కలిగిస్తుంది. స్లీక్ ఫ్రేమ్, ఎర్గానామిక్ డిజైన్‌తో వస్తున్న ఈ అత్యాధునిక రోవర్‌పై 5000లకు పైగా వర్కవుట్లను చేసుకోవచ్చు. ఏడాది వారంటీతోపాటు 30 రోజుల హోమ్ ట్రయల్‌తో వస్తున్న ఈ రోవర్ ఖరీదు రూ. 1,45,000. hydrow.com ద్వారా ఆర్డర్ ఇవ్వవచ్చు.