కాబోయే అమ్మల కోసం..
కాబోయే తల్లులకు మాత్రం.. ఫ్యాషనబుల్‌గా ఉండాలని అనిపించదా? సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలని ఉండదా? అందులోనూ ఆ సమయంలో ఆమె మనసుకు ప్రశాంతత అవసరం.
కాబోయే తల్లులకు మాత్రం.. ఫ్యాషనబుల్‌గా ఉండాలని అనిపించదా? సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలని ఉండదా? అందులోనూ ఆ సమయంలో ఆమె మనసుకు ప్రశాంతత అవసరం. ఒంటి మీద ఏదో ఒకటి వేలాడదీసుకుంటే.. ఇబ్బందిగా అనిపించదూ? అందుకే, అభి కల్యాణి అనే మామ్‌ప్రెన్యూర్ గర్భిణుల కోసం ఓ రంగుల ప్రపంచాన్ని సృష్టించింది.
ఆ చెన్నై యువతి ‘తొట్టిల్ మెటర్నిటీ’ పేరుతో ఓ స్టార్టప్‌కు ప్రాణం పోసింది. అలా అని, తనేం పారిశ్రామికవేత్త కూతురో, కోడలో కాదు. సామాన్య మహిళ. రంపపు కోతను తలపించే వైవాహిక బంధం నుంచి బయటపడింది. అప్పటికే తను పదినెలల గర్భిణి. చేతిలో చిల్లిగవ్వ లేదు. మేమున్నామని ఆదుకునేవారు లేరు. ఆ దుర్మార్గుడు పట్టా కాగితాలు కూడా తగులబెట్టేశాడు. దీంతో ఉద్యోగం దొరకడం అసాధ్యమైంది. అయినా సరే వెనకడుగు వేయలేదామె. తమిళంలో తొట్టిల్ అంటే.. ఊయల.
త్వరలోనే, తన నట్టింట్లో ఊయలలూగబోయే బిడ్డకు బంగారు భవిష్యత్తు కల్పించాలన్నదే అభి లక్ష్యం. కాబట్టే, అదే పేరుతో ఓ అంకుర సంస్థను స్థాపించింది. ప్రత్యేకించి గర్భిణుల కోసం మాక్సీ డ్రెస్‌లు, కుర్తీలు, బ్లౌజులు, నైట్ గౌన్లు, ఫొటోషూట్ గౌన్లు.. ఇలా అనేకం డిజైన్ చేసింది. ఇప్పటికే ఆన్లైన్లో ఈ ఉత్పత్తులు ఆదరణ పొందాయి. గత ఏడాది చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఓ ఆఫ్‌లైన్ స్టోర్ కూడా ప్రారంభించింది కల్యాణి.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

