HomeSuccess-storySmita Was Selected As The Founder Of The Google Startup Accelerator Program For Indian Women
‘రంగ్ దే’ స్మితారామ్
బంగ్లాదేశ్‌లో విజయవంతమైన ఫార్ములా, భారత్‌లో మాత్రం ఎందుకు ఫలితాన్నివ్వదు? .. అనిపించింది. అంతే, భర్త రామ్‌తో కలిసి ఇండియాకు తిరిగొచ్చింది. బెంగళూరు కేంద్రంగా ‘రంగ్ దే’ పేరుతో మైక్రోఫైనాన్స్ కంపెనీ స్థాపించింది.
బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో నడుస్తున్న సూక్ష్మరుణ కార్యక్రమం ఓ అబ్బురంలా అనిపించింది ఆమెకు. అప్పటికి స్మితారామ్ యూకేలోని ఓ సంస్థలో ఫైనాన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నది. ఆన్లైన్లో భారతీయ దినపత్రికలు చదువుతున్నప్పుడు.. ‘వడ్డీభారం మోయలేక చిరు వ్యాపారి ఆత్మహత్య’, ‘అప్పుల ఊబిలో రైతన్న’ తదితర శీర్షికలతో వస్తున్న వార్తలు ఆమెను కలతకు గురిచేసేవి. బంగ్లాదేశ్‌లో విజయవంతమైన ఫార్ములా, భారత్‌లో మాత్రం ఎందుకు ఫలితాన్నివ్వదు? .. అనిపించింది. అంతే, భర్త రామ్‌తో కలిసి ఇండియాకు తిరిగొచ్చింది.
బెంగళూరు కేంద్రంగా ‘రంగ్ దే’ పేరుతో మైక్రోఫైనాన్స్ కంపెనీ స్థాపించింది. ఓ వైపు.. బ్యాంకు ఖాతాలోనో, బీరువాలోనో వృథాగా మూలిగే డబ్బు. మరోవైపు.. అధిక వడ్డీల భారంతో కునారిల్లుతున్న పేదలు. ఇద్దరినీ ఓ చోట కలిపితే? ఆ సొమ్మును రుణంగా ఇస్తే? ఇద్దరికీ ప్రయోజనమే. అలా, పీర్-టు-పీర్ లెండింగ్ సూత్రాలను జనంలోకి తీసుకెళ్లింది స్మిత. బ్యాంకులు సైతం రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేసే అత్యంత నిరుపేదలపై దృష్టి సారించింది స్మిత. క్షేత్రస్థాయిలోని ఎన్జీవోల సిఫారసుతో ‘రంగ్ దే’ అప్పులు ఇస్తుంది. ఇప్పటికే ఎనిమిది వేలమందికి రుణాలు అందాయి. ప్రతి పైసా సద్వినియోగమైంది. తాజాగా గూగుల్ స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ఫర్ ఇండియన్ ఉమెన్ ఫౌండర్‌కు ఎంపికైంది స్మిత.