Vasudha Munjal | తాతయ్య స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్
హీరో మోటార్స్ గురించి తెలియనివారు ఉండరు. బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ స్థాపించిన ఈ కంపెనీ ఆటోమొబైల్ రంగంలో పెను సంచలనం. బ్రిజ్మోహన్ తనయుడు పవన్ ముంజాల్ తన సమర్థతతో మరింత లాభాల బాట పట్టించారు.
Vasudha Munjal | హీరో మోటార్స్ గురించి తెలియనివారు ఉండరు. బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ స్థాపించిన ఈ కంపెనీ ఆటోమొబైల్ రంగంలో పెను సంచలనం. బ్రిజ్మోహన్ తనయుడు పవన్ ముంజాల్ తన సమర్థతతో మరింత లాభాల బాట పట్టించారు. ఆయన కూతురు వసుధ కూడా పెద్దల మార్గంలోనే కంపెనీలోకి వచ్చేస్తుంది అనుకున్నారంతా. కానీ, ఆటోమొబైల్ రంగం వడ్డించిన విస్తరి కాదని భావించింది. సొంతంగా మరో వ్యాపారం చేయాలనుకుంది.
ఇష్టంగా చాక్లెట్ల బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఇదేమంత తేలికగా జరగలేదు. మార్కెట్ గురించీ, వినియోగదారుల అభిరుచి గురించీ చాలా విశ్లేషణ జరిగాకే Choko la అనే కంపెనీని స్థాపించింది. నాణ్యత కలిగిన చాక్లెట్లు, చాక్లెట్ పానీయాలు అందిస్తూ మార్కెట్లో నిలదొక్కుకుంది. తనకు తాత నుంచి కొంత, తండ్రి నుంచి కొంత వ్యాపార నైపుణ్యం అలవడిందని చెబుతుంది వసుధ. కంపెనీలోని ప్రతి ఉద్యోగికి తాతయ్య అందుబాటులో ఉండేవారనీ, వారి కష్టసుఖాలు గమనించుకునేవారనీ గుర్తుచేసుకుంటుంది. పోటీదారుల గురించి ఎప్పుడూ ఆలోచించవద్దనీ, నీకు నువ్వే పోటీ అనే విషయాన్ని మర్చిపోవద్దనీ బ్రిజ్మోహన్ జీ చెప్పిన మాటనే అనుసరిస్తూ… వైవిధ్యమైన రంగంలో దూసుకుపోతున్నది వసుధ.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

