బామ్మ చదువు ఓ స్ఫూర్తిపాఠం
ఎనభై ఏండ్లు దాటాయంటే దాదాపుగా కాటికి కాళ్లు చాపుకొనే వయసు. ఇంత వృద్ధాప్యంలోనూ కొంతమంది అద్భుతాలు చేస్తుంటారు. అమెరికాకు చెందిన ఎనభై మూడేండ్ల మేరీ ఎ. ఫౌలర్ అలాంటివారే.
ఎనభై ఏండ్లు దాటాయంటే దాదాపుగా కాటికి కాళ్లు చాపుకొనే వయసు. ఇంత వృద్ధాప్యంలోనూ కొంతమంది అద్భుతాలు చేస్తుంటారు. అమెరికాకు చెందిన ఎనభై మూడేండ్ల మేరీ ఎ. ఫౌలర్ అలాంటివారే. ఆమె హోవర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ‘దైవత్వం’ అనే అంశంలో డాక్టరేట్ అందుకున్నారు మరి! అంతేకాదు, ఆ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్న అతి వృద్ధ వ్యక్తి కూడా మేరీనే కావడం గమనార్హం. అలా వయసుకు, చదువుకు సంబంధం లేదని ఆమె రుజువు చేశారు.
ఆమె మేపుల్ స్ప్రింగ్స్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజి అండ్ సెమినరీ నుంచి డిగ్రీ, రెండు మాస్టర్స్ డిగ్రీలు పూర్తిచేశారు. అయితే, 1959లో పాఠశాల విద్య పూర్తిచేసిన ఈ బామ్మ తాను అంతకుమించి చదువుతానని అనుకోలేదట. ఇక ఇంత పెద్ద వయసులో డాక్టరేట్ గురించి మాట్లాడుతూ “కనీసం నేను సమాచారాన్ని గుర్తుపెట్టుకుంటానని కూడా అనుకోలేదు” అంటారు మేరీ.
తాను ఎనభైమూడేండ్ల వయసులో డాక్టరేట్ సాధించింది కాబట్టి, వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా తమ కలలను నిజం చేసుకోవచ్చని సలహా ఇస్తారు. తన చదువు నిర్విరామంగా కొనసాగడానికి స్ఫూర్తి తన తల్లిదండ్రులే అని చెబుతారు. మేరీ తల్లిదండ్రులు చదువుకోవడం, రాయడం నేరంగా పరిగణించే రోజుల్లో జన్మించారు. దీంతో తన తండ్రికి చదవడం, రాయడం, సంతకం చేయడం తామే నేర్పామంటారు మేరీ. చదువు విలువ వారి నుంచే తెలిసిందని, ఆ స్ఫూర్తే ఇప్పటికీ నిలిచి ఉందని ఆమె సంతోషంగా చెబుతారు. ఇలా ఉంటే మేరీ డాక్టరేట్ అందుకోవడంపై స్పందిస్తూ… “ఇది మైలురాయిగా పరిగణించదగ్గ విజయం” అని హోవర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డివినిటీ ప్రశంసల వర్షం కురిపించింది. మంచిపని చేయడానికి వయసు అసలు ఆటంకం కాదనే మేరీ సంకల్పానికి హ్యాట్సాఫ్!
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

