-హిమాలయ లేదా యవ్వన లేదా తరుణ నదులు
-గంగానది: అలకనంద-భాగీరథి అనే రెండు నదులు దేవ ప్రయాగ (ఉత్తరాఖండ్) వద్ద కలిసి గంగానదిగా ఏర్పడుతాయి. ఇది భారతదేశంలో అతిపొడవైన నది. భారత్, బంగ్లాదేశ్ గుండా ప్రవహించి డాఖిన్‌షా బాజ్పూర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
-గోదావరి నది: మహారాష్ట్రలో ఉన్న పశ్చిమ కనుమల్లోని నాసిక్ త్రయంబక్ వద్ద బిల సరస్సులో ఈ నది జన్మిస్తుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాంలలో ప్రవహిస్తుంది. ఏడు పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది దేశంలో రెండో పొడవైన, దక్షిణ భారతంలో అతి పొడవైన నది.
-కృష్ణా నది: పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద గల జోర్గ్రామంలో జన్మిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రవహిస్తుంది. ఏపీలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలస్తుంది. ఇది దేశంలో మూడో పొడవైన నది.
-మహానది: ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో సిహావా వద్ద జన్మిస్తుంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో ప్రంహించి నారాజ్ (కటక్) వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.