-దేశంలో అంతరించిపోతున్న పులులను సంరక్షించి వాటి సంఖ్యను పెంచేందుకు 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రాజెక్టు టైగర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
-ఈ కార్యక్రమాన్ని పలమావ్ టైగర్ రిజర్వులో ప్రారంభించారు.
-ఈ పథకాన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పర్యవేక్షిస్తుంది.
-అత్యంత అరుదైన బెంగాల్ పులులతోపాటు దేశవ్యాప్తంగా పులులు నివసించే ప్రాంతాలను రక్షించి, వేటగాళ్ల బెడదను అరికట్టడం ఈ పథకం ఉద్దేశం.
-వేటగాళ్లను అడ్డుకొనేందుకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది.
-టైగర్ రిజర్వులుగా ప్రకటించిన అడవుల్లో మానవ సంచారాన్ని తగ్గించేందుకు అక్కడి గ్రామాలను మైదానప్రాంతాలకు తరలించటం ఈ పథకంలో మరో కార్యక్రమం.