ఈయన 1893లో జన్మించారు. నిత్యశివపూజా దురంధరులు. ఆధ్యాత్మికజ్ఞానసంపన్నులు.ఈయన చందంపేట (మెదక్)లో నివసించినట్లు తెలుస్తుంది.
రచనలు 1) కృష్ణగారడి (హరికథ) 2) రుష్యశృంగ న్యాయ శతఘ్ని 3) విజయ భాస్కర కర్ణకవచ ప్రదానం 4) వాల్మీకి హృదయం 5) భీష్మభాషణం 6) సంగమేశ్వర శతకథ
7) మార్కండేయ పురాణం రాశారు.
ఈమెది ఆందోలు సంస్థానం. ఐష్టెశ్వర్యాలతో తులతూగి, సంసారం సారంలేనిదని, సుఖం అశాశ్వతమైనదని భావించి వేదాంత మార్గం అనుసరించింది. మానసబోధ అనే పద్యకృతి రచించారు.సారంలేని సంసార సాగరమున మునిగి పుట్టుచు గిట్టుచు మోహమొంది దరినిగానవు నీ బాట నెరగలేవు హరిని భజియించు మానందమబ్బుమనసా ఈమె రాసిందే.
ఈయనది ఆందోల్. గోదానాయకమ్మ, రంగాచార్యులు తల్లిదండ్రులు. మెదక్ జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించారు. ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ ఉండేవారు. రచనలు గురుభక్తి, జోగినాథ (పద్యాలు), రంగనాథస్తవం (దండకం), వీరభద్రీయం, వెంకటాచలం, శ్రీరామసుప్రభాతం రాశారు.
ఈయనది మెదక్ జిల్లా దౌల్తాబాద్ గ్రామం. గోమతి, వెంకటేశ్వర శర్మలకు జన్మించారు. ఈయన జాతక ముహూర్త, వాస్తుశాస్ర్తాల్లో ప్రావీణ్యుడు. 1) చంద్రశేఖర శతకం 2) కాళహస్తీశ్వర గేయ మాలిక 3) రాధికామనోహరీయం రాశారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో డీఎంవోఎల్ చదివారు.
ఈయన సిద్దిపేట దగ్గర రాజగోపాల్‌పేట గ్రామంలో మనోహరాంబ, లక్ష్మయ్యలకు జన్మించారు. రచనలు.. పురుషోత్తముడు, రామప్రభు శతకం, శిథిల విపంచి, తుకారామస్వామి చరితం, చిత్రలేఖ, శ్రీరామచంద్రిక, వాసరేశ్వరీ శతకం, ఆత్మవేదం, అష్టకాల సత్యాలు, బ్రహ్మర్షి దైవరాతుడు, షష్టిపూర్తి దాని అవసరం, శ్రీసరస్వతీదీక్షానియమావళి, చందోదర్శనం సంస్కృత రచనలు, అఖండానంద సరస్వతీస్వామి పూజ, శ్రీసరస్వతీదేవీ షోడశోపచార పూజ, శ్రీసరస్వతీదేవి సుప్రభాతం, శ్రీసర్వస్వత్యాష్టకమ్-శరణాగతి, నికారదేవీ సహస్రనామ స్తోత్రం, శ్రీదేవి పూజాకల్పం, సారస్వతీంభవయే, సరస్వతీస్తోత్రం, శ్రీసరస్వతీస్తుతి కల్పం, శ్రీరామసుప్రభాతం మొత్తం 20 రచనలు.
రచనలు 1) మూకపంచశతి ఆంధ్రానువాదం
2) ఆర్యాశతకం 3) దేవీమహిమ
నారాయణ్‌ఖేడ్ మండలం కడ్పల్ చల్లగిరిలో జన్మించారు. తండ్రి నారాయణాచార్యులు. రచనలు 1) చల్లగిరి లక్ష్మీవెంటేశ్వర సుప్రభాతం 2) శ్రీరామచంద్రసుప్రభాతం 3) నృసింహస్తవం-నృసింహ దండకం 4) చంద్రకళాంధ్ర వ్యాకరణం 5) శ్రీకృష్ణగీత 6) అద్దంకి సుద్దులు 7) తిరుమల తెరుపులు.
సంగారెడ్డి మండలం చేర్యాల గ్రామంలో జన్మించారు. ఈయన కాలం 1890-1962. ఈయన పరమ భక్తులు. 1) శ్రీకృష్ణలీలలు 2) ద్రౌపదీ స్వయంవరం 3) కీచకవధ 4) ఉత్తర వివాహం (నాటికలు). ఈయన విశిష్టాద్వైతులు. అయినా హరిహరా భేదాన్ని పాటించేవారు.
1957, మార్చి 13న జన్మించారు. జయలక్ష్మి, పాపయ్యశాస్త్రిలకు సిద్దిపేటలో జన్మించారు. ఈయనకు వైదిక ఆధ్యాత్మిక ధర్మ ప్రచారం అంటే ఇష్టం. రచనలు 1) భక్తి సుధ 2) శైవం 3) నిత్యధర్మ దీపిక 4) జీవన సాఫల్యం 5) ప్రణుతి 6) ధ్యానామృత 7) అభంగానువాదగంగ 8) అక్షరాలలో పరమార్థం 9) పంచమి 10) నీరాజనం.
ఈయనది మిరుదొడ్డి గ్రామం. కూచన రామమ్మకు జన్మించారు. కులం పద్మశాలీ. రచనలు 1) కుచేలోపాఖ్యానం 2) విప్రనారాయణ చరితం 3) సత్యవర్మ 4) కాళింగ మర్దనం 5) ప్రభావతీ విలాసం 6) రుతుధ్వజ నాటకం 7) ఇంద్రసభ 8) బ్రహ్మగర్వాపహరణం 9) మాంధాత చరిత్రం 10) రుక్మిణీ కల్యాణం 11) అంబోపాఖ్యానం 12) మార్కండేయ చరితం 13) బాలక్రీడలు 14) రాధామాధవం 15) లక్షణపరిణయం 16) బిల్హణీయం 17) శారదాపద్యాలు 18) దుర్యోధన గర్వాపహరణం 19) సావిత్రీవ్రతధర్మాలు 20) పునర్జన్మ నవరత్న కందర్థాలు.
ఈయన కాలం 1880-1950. మోత్కూరు మండల రెడ్లరేపాక గ్రామంలో జన్మించారు. కవి, హరికథకులు. రచనలు 1) అభినవ హరికథా మహాభారతం 2) రామాయణం 3) కుచేల 4) ప్రహ్లాద 5) రామానుజ చరిత్ర 6) గోదాకల్యాణం 7) సీతాకల్యాణం రాశారు. విశిష్టాద్వైత సంప్రదాయకులు. ఉర్దూ, పారశీక, సంస్కృతం, తెలుగు భాషల్లో పండితులు.
ఈయనది బీబీనగర్. రచనలు 1) కృష్ణనామాంకిత స్త్రీవిరహ సీసశతకం 2) అద్భుత రామాయణం 3) జీడికంటి శతకం 4) శ్రీరామనామ ప్రతిపాదిత ధైర్యశతకం 5) లక్ష్మీశతకం రాశారు.
1921, డిసెంబర్ 21న హుజూర్‌నగర్‌లో జన్మించారు. రచనలు 1) బాలభక్తి 2) వెంకటేశ్వర శతకం 3) గోదాకల్యాణం. 1959లో సినిమాలో సహాయ సంగీత దర్శకుడిగా చేరారు. స్వర్ణగౌరి, ధర్మస్థల మహత్యం, రాజాసత్యవ్రత సినిమాలకు పనిచేశారు.
1944, అక్టోబర్ 2న భువనగిరి మండలం రుస్తాపురం గ్రామంలో నర్సింహ, ఎల్లమ్మలకు జన్మించారు. 1) ముకుంద భజనమాల (1952) 2) శ్రీరామ భజనామృతం (1962) 3) శ్రీకృష్ణకీర్తనలు (1964) 4) సాంబశివ కీర్తనలు 5) శ్రీసద్గురు సంస్కృతి (1971) 6) శ్రీనృకేసరీ శతకం (1982) 7) శ్రీహరి శంకర సూక్తులు 8) మల్లికార్జున శతకం 9) హృదయవేదన (1988) 10) శ్రీకుసుమ హరనాథ పూజావిధానం (1989) 11) శ్రీమద్భగవద్గీత (అనువాదం) 12) శమంతకోపాఖ్యానం 13) ప్రహ్లాద చరిత్ర.
మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో 1951, జూలై 3న నర్సింహదేశికులు, రంగనాయకమ్మలకు జన్మించారు. కుముద ప్రచురణలు అనే సంస్థను స్థాపించారు. రచనలు 1) శ్రీరామలింగేశ్వర శతకం (1979) 2) వీరాచల క్షేత్ర మహత్యం
1939, అక్టోబర్ 7న ఆత్మకూరు మండలం చాడ గ్రామంలో కృష్ణయ్య, తాయమ్మలకు జన్మించారు. రచనలు 1) శ్రీవెంకటేశ్వర సుప్రభాతస్తోత్ర ప్రపత్తి 2) శ్రీలక్ష్మీనరసింహ స్తోత్రం 3) శ్రీమద్భగవద్గీత (అనువాదం) 4) శ్రీలక్ష్మీనృసింహ శతకం.
1940లో నల్లగొండ మండలం పానగల్లులో జన్మించారు. రచనలు 1) అన్నమాచార్యుల శృంగార సంకీర్తనలు-మధురభక్తి 2) గేయ భగవద్గీత 3) ప్రతిమా నాటకం 4) శృంగార రంగనాథ కీర్తనలు 5) ఆంజనేయ శతకం 6) భక్తి-దేశభక్తి 7) ప్రబోధాత్మక గేయాలు.
ఈయన సూర్యాపేట వాసి. 1902లో వెంకట రాఘవాచార్యులు, నర్సమ్మలకు జన్మించారు. రచనలు 1) కూర్మనారాయణ చరిత్ర (1934) 2) శ్రీరంగాపుర సత్యనారాయణ శతకం (1912) 3) శ్రీరాఘవ శతకం (1925) 4) గోపాల చూడామణి శతకం (1928) 5) మానసప్రబోధ శతకం (1946) 6) శ్రీమత్ తిరుమలాపుర భోగసుందర సీతారామ శతకం (1948) 7) శ్రీరంగాపురం సత్యనారాయణ శతకం (1950లో మరొకటి రాశారు) 8) శ్రీసత్యనారాయణ వ్రతం (1938) 9) ఉర్లుగొండ లక్ష్మీనృసింహ తారావళి (1948) 10) శ్రీరంగాపుర సత్యదేవ స్ర్తోత్ర తారావళి (1957) 11) శ్రీగోదాదేవిస్తవం 12) కల్వచెరువు సీతారామచంద్ర స్ర్తోత్రం 13) తిరుమల వెంకటేశ్వర అంత్యప్రాస శతకం. 1961, ఆగస్టు 15న సూర్యాపేటలో మరణించారు.
రామారావు, బుచ్చమాంబ దంపతులకు 1904, జనవరి 8న భువనగిరిలో జన్మించారు. రచనలు 1) శ్రీరామపూజా విధానం 2) సద్గురు పూజావిధానం 3) ధర్మగీత 4) ఆధ్యాత్మ కీర్తనలు 5) శ్రీరామభజనావళి 6) బాబా కీర్తనలు 7) బాబా పూజావిధానం 8) శ్రీకుసుమ హరనాథ చరిత్ర 9) జపమహత్యం 10) ఆంజనేయ దండకం 11) ఓంకార మహిమ 12) ఆత్మనిష్ట 13) ప్రేమగీతాంజలి 14) యోగాభ్యాసం వేదాంత, భక్తి కీర్తనలు రాసిన ఈయనకు సదాసనయోగి అనే బిరుదు ఉంది.
1900-50 మధ్య వెంకటాచారి, అనసూయ దంపతులకు జన్మించారు. భక్తకవిగా ప్రసిద్ధులు. రచనలు కౌసల్యాపరిణయం, కృష్ణార్జునీయం, రుక్మాంగద, యమక తారావళి, పరకాల విజయం, సత్యనారాయణ స్వామి. గోల్కొండ కవుల సంచికలో 332వ పేజీలో కామిని శీర్షికన ఈయన పద్యాలు రాశారు.
ఈయన 1908, జూలై 15న జన్మించారు. చండూరు సాహితీ మేఖలను ఏర్పాటు చేశారు. ఈయన అనేక శాస్ర్తాల్లో దిట్ట. వేదాంత తాత్విక గ్రంథాలు 1) కృష్ణకథ (1958) 2) వివేక శిఖరాలు (1955) 3) ప్రభుసప్తతి (1955) 4) భారతీయ సంస్కృతి (1973) 5) కృష్ణబోధ షడ్దర్శన రహస్యం 6) తత్వసమావర్తనం 7) వేదాంతసారం 8) దశోపనిషత్తులు 9) బ్రహ్మసూత్రాలు 10) ప్రస్థానత్రయం 11) తాత్విక తరంగాలు 12) గీతగోవిందం 13) సంస్కృత భాషా
సౌలభ్యం మొదలైనవి రాశారు.
ఈయన కాలం 1846-1937. హాలియా మండలం ఇబ్రహీంపేట నివాసి. రామానుజాచార్యులు, ఆండాళమ్మలకు జన్మించారు. సంస్కృతం, తెలుగు, ఉర్దూ భాషల్లో పండితులు. రచనలు 1) సారంగశైల సీతారామ శతకం (1920) 2) పాలెం నృసింహ వైభవం ప్రహరి-లాలి (1925) 3) కుముదవల్లీ విలాసం పరిష్కరణ (రచన పోనుగంటి జగన్నాథరావు) 4) శ్రీప్రతాపగిరి మహత్యం 5) శ్రీమత్సారంగశైల మహత్యం 6) శంకర విజయం 7) అజామిళోపాఖ్యానం 8) అంబరీష 9) జాంబవతి 10) వామన చరిత్ర 11) రాధాకృష్ణ విలాసం 12) ఏకాశ్వాస రామాయణం 13) భావనాశతకం 14) మట్టపల్లి నృసింహశతకం 15) ముప్పవరం వెంకటేశ్వర శతకం 16) యాదగిరి లక్ష్మీనృసింహ శతకం 17) తిరుమల వేంకటేశ్వర శతకం 18) సిర్సనగండ్ల నృకేసరి హరివంశం 19) దాశరథీ దయానిధి శతకం 20) మాధవ శతకం 21) నిడిచెనమెట్ల కందాళ వారి చరిత్ర 22) మట్టపల్లి నృసింహ స్తోత్రం (సంస్కృతం) 23) ప్రతాపగిరీశ నృకేసరి శతకం.
ఈయన 1939లో చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో కనకయ్యచారి, అంతమ్మలకు జన్మించారు. సంస్కృతాంధ్రాలు తెలుసు. రచనలు 1) శ్రీవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞాన తత్వ కందార్థాలు 2) వీరబ్రహ్మేంద్రస్వామి వీధి నాటకం 3) వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర.
ఈయన కాలం 1620-88. తల్లిదండ్రులు లింగనమంత్రి, కామమ్మ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినవారు. తెలంగాణ పదకవితా రచయితలలో ప్రథముడు అనదగ్గవారు. రామదాసు తన కీర్తనల్లో పరమాత్ముడిని నాయకునిగా, జీవాత్మను నాయికగా, సఖి గురువుగా పదకీర్తనల్లో వర్ణిస్తూ ఉంటారు. రఘునాథ భట్టాచార్య, కబీర్దాసు ఈయనకు గురువులు. రఘునాథ భట్టాచార్య సమాధి నాయకన్‌గూడెంలో నేటికీ ఉంది.
1) తారకమంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువె యని నమ్మరయన్నా రామ నామం జపిస్తే మృత్యుభయం ఉండదని రామదాసు కీర్తన.
2) ఇక్ష్వాకు కులతిలక యికనైన బలుకవే రామచంద్రా
భరతునకు జేయిస్తి పచ్చల పతకము రామచంద్రా
ఆ పతకానికి పట్టె పదివేల వరహాలు రామచంద్రా
కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా
నీవు కులుకుతు దిరిగేవు ఎవడబ్బ సొమ్మని రామ చంద్రా!!
బందిఖానలో ఒక్కొక్క దెబ్బపడుతుంటే రాసిన కీర్తన ఇది.
3) చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి
4) పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
5) పలుకే బంగారమాయెనా కోదండపాణి.. పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ
6) ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా నా తరమా భవసాగర మీదను నళినదళేక్షణ రామా
7) నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ! ననుబ్రోవమని చెప్పవే మొదలైనవి. ఈయన గొప్ప వేదాంతి. దాశరథీ శతకం రాశారు. రామదాసు పదకవితల సారం తెలుసుకోవాలని జనం తపిస్తూ ఉంటారు.