కావలసిన పదార్థాలు
గోధుమ పిండి: కప్పు
శనగపిండి: కప్పు
తురిమిన క్యాబేజీ: కప్పు
అవిసె గింజలు: రెండు టేబుల్ స్పూన్స్
కారం: అర స్పూను
అల్లం వెల్లుల్లి: ముద్ద పావు స్పూను
చింతపండు రసం లేదా ఆమ్ చూర్: ఒక స్పూను
గరం మసాల పొడి: కొద్దిగా
బెల్లం: చిన్న ముక్క
ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం
ముందుగా అవిసె గింజలని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. క్యాబేజీని సన్నగా తరుముకోవాలి. చింతపండు రసం నానబెట్టుకోవాలి. చింతపండు వాడటం ఇష్టం లేని వాళ్లు ఆమ్చూర్ వాడుకోవచ్చు. బెల్లాన్ని కొద్దిగా నీళ్లలో వేసి కరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకుని గోధుమపిండి వేయాలి. అందులో క్యాబేజీ తురుము, ఉప్పు, కారం, చింతపండు రసం, అవిసె గింజల పొడి, నానబెట్టిన బెల్లం నీళ్లు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇష్టం ఉన్నవాళ్లు గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. గోధుమపిండి మిశ్రమాన్ని గుండ్రటి ముద్దలా చేసి పరాటాల్లా ఒత్తుకుని పెనం మీద కాల్చుకోవాలి. టమాటా చట్నీతో తింటే తియ్య తియ్యగా పుల్లపుల్లగా కట్టా మీఠా పరాఠా ఎంతో బాగుంటుంది.
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు