Children Stories | కుండనిండా తెలివిని నింపి అక్బర్ బాద్షాకు పంపిన బీర్బల్.. కథ చదివితే నవ్వకుండా ఉండలేరు!
Children Stories | ఒకసారి బీరుబల్ మీద అకుబర్ పాదుషాకు కోపమచ్చింది. అచ్చిందెన్కనే.. “నువ్వు నా కండ్లకు కనవడకుంట వో!” అంట హుకుం జారీ జేశిండు. ‘సరే అయితెమాయె! నాకు ఇల్వ లేనికాడ నేనెందుకు ఉండాలె’ అనుకొని, తట్టబుట్ట - ముల్లె మూట సదురుకొని, దూరంగున్న ఒక పల్లెటూరుకు మకాం మార్శిండు బీరుబల్.
Children Stories | ఒకసారి బీరుబల్ మీద అకుబర్ పాదుషాకు కోపమచ్చింది. అచ్చిందెన్కనే.. “నువ్వు నా కండ్లకు కనవడకుంట వో!” అంట హుకుం జారీ జేశిండు. ‘సరే అయితెమాయె! నాకు ఇల్వ లేనికాడ నేనెందుకు ఉండాలె’ అనుకొని, తట్టబుట్ట – ముల్లె మూట సదురుకొని, దూరంగున్న ఒక పల్లెటూరుకు మకాం మార్శిండు బీరుబల్. ఆడ ఎవ్వలు కూనం బట్టకుంట ఏషం, పేరు.. రొండు మార్సుకుని ఎవుసం జేయవట్టిండు. కొన్ని దినాలు గాంగనే బీరుబల్ లేకుంటె ఎట్లుంటదో తెలిసి.. అకుబర్ పాదుషా పొద్దువోక తాయిమాయి అయిండు. దర్బారుల ఆళ్లకూ- ఈళ్లకూ బీరుబల్ యాడున్నడో దొరుకవట్టుమంట జెప్పిండు. ఆళ్లు రాజ్యం అన్ని మూలల్ల తిరిగచ్చిండ్లు. ఎవలకు బీరుబల్ జాడ దెలువలే గదా.. ఏగులకు గూడ దొరుకలే!
బీరుబల్ను ఎట్ల వట్టుకోవాల్నో అకుబర్కు ఎరికే! ఎంటనే దండోరా ఏశెటోళ్లను విలిశి.. ఆళ్లకు ఒక ఖాళీ కుండ ఇచ్చి.. “ఈ కుండనిండ తెలివి నింపి తెచ్చినోళ్లకు ఇనామిత్త!” అంట దండోరా ఏయించిండు. బీరుబల్ ఉన్న ఊర్లెగూడ గిట్లనే దండోరా ఏశిండ్లు. గది ఇన్న బీరుబల్ ఎంటనే కర్బూజ ఇత్తునాలు దెచ్చి అలికిండు. ఏనుకొని పిందెలు ఏయంగనే.. ఒక పిందెను మెల్లంగ ఖాళీ కుండల వెట్టిండు. కొన్ని దినాలు కాంగనే.. కర్బూజ కాయ కుండ నిండుగ వెరిగింది. ఆ కాయను తీగకెల్లి దెంపి, దర్బారుకు వంపిండు. ‘కుండలకెల్లి కాయను అవుతల్కి దీస్తే.. కుండ నిండ నింపిన తెలివి గనవడ్తది’ అంట శిట్టి గూడ రాశి అంటేశిండు. అది సదివిన అకుబర్.. “ఇది వంపింది బీరుబలే!” అంట మంత్రులకు జెప్పి, ఆళ్లను గా ఊరికి వంపిండు. బీరుబల్ను విలిపిచ్చిండు. అటెన్క ఎప్పటోలెనే ఇద్దరూ కలిశిమెలిశి ఉన్నరుల్లా!
– పత్తిపాక మోహన్
Read More :
Children Stories | తెలివైనోడికి పెద్దపులి ఎదురొస్తే.. ఉరికిచ్చి ఉరికిచ్చి సచ్చేటట్టు చేసిండు
Children Stories | ఎవలైతేంది అని మేకపిల్లను ఆంబుక్క పెట్టిన పెద్దపులి కథ ఇదీ!
Children Stories | తన పిల్లలను తింటున్న పాము ఆట కట్టించిన కాకి కథ
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

