Children Stories | జరమొచ్చి కచేరీలకు రాని బీర్బల్‌కు భలే తమాషా పరీక్ష పెట్టిన అక్బర్
Children Stories | అకుబర్, బీరుబల్ కతలు మీకు ఎరుకే గదా! ఇది అసొంటి కతనే! ఒకపారి పాపం బీరుబల్కు జరమొచ్చింది. కచేరీలకు నాలుగైదు దినాలు పోలేదు. బీరుబల్ రాకపోయేటాలకు.. దినాము పొద్దువోలేదు అకుబర్కు. ఆల్లనీల్లను అడిగితె.. జరమచ్చింది, గందుకే కచేరీలకు అత్తలేడంట జెప్పిండ్రు.
Children Stories | అకుబర్, బీరుబల్ కతలు మీకు ఎరుకే గదా! ఇది అసొంటి కతనే! ఒకపారి పాపం బీరుబల్కు జరమొచ్చింది. కచేరీలకు నాలుగైదు దినాలు పోలేదు. బీరుబల్ రాకపోయేటాలకు.. దినాము పొద్దువోలేదు అకుబర్కు. ఆల్లనీల్లను అడిగితె.. జరమచ్చింది, గందుకే కచేరీలకు అత్తలేడంట జెప్పిండ్రు. తన తాన పనిజేశిన చిన్నప్పటి సోపతాయె! సూసద్దమని ఇంటికి వోయిండు. అకుబర్ పోయెటాలకు నెత్తిమీద తడి బట్ట గప్పుకొని మంచం మీద ఉన్నడు బీరుబల్. అకుబర్ను సూడంగనే చేయిలేపి సలాం జేశిండు. నాలుగైదు దినాల సంది తిండి తిప్పలు లేకపోయె వరకు బీరుబల్ పీనుగోలె అయిండు. ఆయినెను సూసి.. మునుపటి క్యాలి ఉందా? లేదా? సూడాలనుకున్నడు అకుబర్.
అంతట్లకే దూపయి నీళ్లు తాగనీకి మెల్లగ లేశి, పక్క అర్రలకు పోయిండు బీరుబల్. ఆయినె పోవుడుతోనే.. జేబులకెల్లి రుమాలు దీసి, బీరుబల్ మెత్తకింద వెట్టి.. ఏం దెలువనట్టే గూకున్నడు అకుబర్. నీళ్లు తాగి అచ్చినంక మెత్తమీద తలకాయ వెట్టంగనే.. ఎట్లనో అనిపియ్యవట్టింది బీరుబల్కు. అటూఇటూ బొర్రవట్టిండు. ఏడనో కిందమీదైనట్టు అనిపిచ్చింది. ఆయినె ఆపసోపాలు వడుడు సూశి.. “ఏమైంది? గట్ల జేస్తున్నవు” అంట అడిగిండు అకుబర్. “ఇంతట్లకే నా మంచం మీద ఏదో కిందమీదైంది. ఏమైందో తెలుత్తలేదు” అన్నడు బీరుబల్. “ఏ జరమచ్చింది గదా! అట్లనే గొడ్తది. ఏంగాలే!” అంట అన్నడు అకుబర్. “కాదు కాదు. మెత్త కింద ఏదో ఎత్తుగ గొడ్తంది!” అంట శెయ్యి వెట్టిండు. శెయ్యికి రుమాలు తలిగింది. అది దీస్కొని.. “గింత శిన్న బట్టముక్క ఆడ వెడితె.. నీకు ఎట్ల తెలిశింది?” అంట అడిగిండు అకుబర్. దానికి బీరుబల్.. “హజూర్! జరం నా పెయ్యికి అచ్చింది గని.. నా మనసుకు గాదు గదా!” అంట అనంగనే.. “కావాల్ననే పరీచ్చవట్టి సూద్దామని వెట్టిన!” అంట అన్నడు అకుబర్.
– పత్తిపాక మోహన్
Read More :
Children Strories | బీర్బల్ చెప్పిన ఆ ఒక్క మాటతో సొంత అల్లుణ్నే జైల్లో వేసిన అక్బర్.. పూర్తి కథ వింటే నవ్వాగదు!!
Children Stories | ఎవలైతేంది అని మేకపిల్లను ఆంబుక్క పెట్టిన పెద్దపులి కథ ఇదీ!
Children Stories | తన పిల్లలను తింటున్న పాము ఆట కట్టించిన కాకి కథ
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

