టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ, అతని కుమార్తె జీవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో చాలా పాపులర్ స్టార్లే. జీవా పేరిట ఫేస్బుక్లో లెక్కలేనన్ని ఫ్యాన్ పేజ్లతోపాటు అధికారిక సోషల్ మీడియా ఖాతాలు కూడా ఉన్నాయి. జీవాకు సంబంధించిన చాలా ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి.
ఇప్పుడు తాజాగా తండ్రీకూతుళ్లు కలిసి చేసిన ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో జీవా.. తండ్రిని ‘బూ’ అంటూ భయపెడుతూ కనిపించింది. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ధోనీ, జీవా కలిసి ప్రముఖ బిస్కెట్ కంపెనీ ఓరియో కోసం చేసిన యాడ్ ఇది. ఈ వీడియోను ఓరియో బ్రాండ్.. తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసింది.
కాగా, తాజాగా మహేంద్ర సింగ్ ధోనీని ఒక సూపర్ హీరోగా చూపిస్తూ గ్రాఫిక్ నవల టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ‘అథర్వ-ది ఆరిజిన్’ అనే మెగా బడ్జెట్ గ్రాఫిక్ నవల ఇది. దీన్ని ధోనీ తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేశాడు. ఇది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.