కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే(Zimbabwe) 4 వికెట్ల తేడాతో స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. రెండో టీ20లో 174 రన్స్ టార్గెట్‌తో జింబాబ్వే బరిలోకి దిగింది. అయితే చివరి ఓవర్లో ఆ జట్టు 20 రన్స్ చేయాల్సి ఉంది. మాథ్యూస్ వేసిన ఆఖరి ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టిన జింబాబ్వే బ్యాటర్ లూక్ జాంగ్వే క్రికెట్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేశాడు. 12 బంతుల్లో 25 రన్స్ చేసిన అతను నాటౌట్‌గా నిలిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కైవసం చేసుకున్నాడు. అయితే మాథ్యూస్ వేసిన ఆఖరి ఓవర్లో భారీ షాట్లతో అలరించిన అతను జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లోనూ జాంగ్వే రెండు వికెట్లు తీసుకున్నాడు.
చివరి ఓవర్ తొలి బంతిని సిక్సర్ బాదాడు జాంగ్వే. అయితే ఆ బంతి నో కూడా పడింది. దీంతో ఆరు బంతుల్లో టార్గెట్ 13 రన్స్‌కు చేరుకున్నది. ఇక ఫ్రీ హిట్ బంతికి ఓ ఫోర్ కొట్టేశాడు. ఆ తర్వాత బంతికే మళ్లీ సిక్సర్ కొట్టాడతను. చివరకు 4 బంతుల్లో మూడు రన్స్ మాత్రమే కావాల్సి వచ్చింది. మూడో బంతికి పరుగు రాలేదు. నాలుగో బంతికి జాంగ్వే క్యాచ్ డ్రాపయ్యింది. కానీ ఒక పరుగు వచ్చింది. ఇక అయిదో బంతిని సిక్సర్‌గా మలిచాడు క్లైవ్ మదాండే. జింబాబ్వే జట్టులో క్రెయిగ్ ఎర్విన్ 54 బంతుల్లో 70 రన్స్ చేశాడు.
తొలుత శ్రీలంక ఓ దశలో 27 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే అయిదో వికెట్‌కు మాథ్యూస్, చరిత అసలంక మధ్య 118 పరుగులు భాగస్వామ్యం ఏర్పడింది. మాథ్యూస్ 66 కొట్టి నాటౌట్‌గా నిలిచాడు. గురువారం మూడవ టీ20 మ్యాచ్ జరగనున్నది.
The moment that Clive Madande did it for Zimbabwe and robbed the Sri Lankans 🔥🇿🇼 pic.twitter.com/MJOVR4r2vc
— Adam Theo🇿🇼🏏 (@AdamTheofilatos) January 16, 2024