బులవాయొ : స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ జింబాబ్వే ఆటతీరు మారలేదు. గురువారం నుంచి మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే.. తొలి ఇన్నింగ్స్‌లో 48.5 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ అయింది. బ్రెండన్ టేలర్ (44) టాప్ స్కోరర్.
తొలి టెస్టులో అదరగొట్టిన మాథ్యూ హెన్రీ (5/40) రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ దుమ్మురేపాడు. ఫాల్క్స్కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో వికెట్ నష్టానికి 174 పరుగులు చేసింది.