WI vs ZIM : మాజీ చాంపియన్ వెస్టిండీస్(Westindies)కు జింబాబ్వే(Zimbabwe) జట్టు షాకిచ్చింది. వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్(World Cup Qualifiers 2023 )లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్(Harare Sports Club)లో ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో విండీస్‌ను ఓడించింది. ఆల్‌రౌండ్ సికిందర్ రజా((68, 2 వికెట్లు) బ్యాటు, బంతితో చెలరేగాడు. టెండాయ్ చటరా మూడు వికెట్లతో విండీస్‌ను దెబ్బకొట్టాడు. దాంతో, కరీబియన్ జట్టుకు ఓటమి తప్పలేదు.
మూడో విజయంతో జింబాబ్వే సూపర్ సిక్స్(Super Sixes) రేసులో ముందడుగు వేసింది. గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. నెదర్లాండ్స్ జట్టు 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెట్రన్ రేటులో వెనకబడిన విండీస్ మూడో ప్లేస్‌కు పడిపోయింది.
మొదట బ్యాంటిగ్ చేసిన జింబాబ్వే 268 పరుగులు చేసింది. సికిందర్ రజాతో పాటు, రియాన్ బర్ల్(50) హాఫ్ సెంచరీతో జట్టుకు పోరాడే స్కోర్ అందించారు. లక్ష్య ఛేదనలో ఆది నుంచి తడబడింది. ఓపెనర్ కైలీ మేయర్స్(56) అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. రోస్టన్ చేజ్(44), కెప్టెన్ షై హోప్(30), నికోలస్ పూరన్(34) ధాటిగా ఆడినా జట్టను గెలిపించలేకపోరు. జింబాబ్వే బౌలర్ దాంతో, విండీస్ 233 పరుగులకే ఆలౌటయ్యింది. అద్భుతంగా రాణించిన సికిందర్ రజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.