Christian Roberto | హై హీల్స్‌తో పరుగెత్తి.. 100 మీటర్ల రేసులో గిన్నిస్ రికార్డు సాధించాడు
Christian Roberto : పరుగు పందెంలో ఎవరైనా షూ వేసుకొని పరుగెత్తుతారు. కానీ, మనోడు మాత్రం కాస్త డిఫరెంట్. ఆడవాళ్ల హై హీల్స్(high heels) వేసుకొని పోటీలో పాల్గొన్నాడు. వాటితో వేగంగా నడవడమే కష్టం. అలాంటిది అతను మాత్రం చిరుతలా పరుగు తీశాడు. హై హీల్స్‌తో పోటీలో గెలిచిన మొదటి వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు(Guinness World Records) సృష్టించాడు. అతడి పేరు..
Christian Roberto : పరుగు పందెంలో ఎవరైనా షూ వేసుకొని పరుగెత్తుతారు. కానీ, మనోడు మాత్రం కాస్త డిఫరెంట్. ఆడవాళ్ల హై హీల్స్(high heels) వేసుకొని పోటీలో పాల్గొన్నాడు. వాటితో వేగంగా నడవడమే కష్టం. అలాంటిది అతను మాత్రం చిరుతలా పరుగు తీశాడు. విజేతగా నిలిచి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. హై హీల్స్‌తో పోటీలో గెలిచిన మొదటి వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు(Guinness World Records) సృష్టించాడు. అతడి పేరు.. క్రిస్టియన్ రాబెర్టో లోపెజ్ రోడ్రిగ్(Christian Roberto Lopez Rodriguez).
రికార్డులు బ్రేక్ చేయడమంటే ఇతడికి మహా సరదా. ఇప్పటికే అతడి పేరు మీద 12 రికార్డులు ఉన్నాయి. కొత్త రికార్డుపై కన్నేసిన అతను ఈసారి వెరైటీగా ఆలోచించాడు. హై హీల్స్‌తో పరుగెత్తి వేగంగా 100 మీటర్ల పరుగు పూర్తి చేశాడు. క్రిస్టియన్ 12.82 సెకన్లలోనే గమ్యస్థానానికి చేరాడు. ఒలింపిక్ విజేత(Olympics Winner) ఉసేన్ బోల్ట్(Usain Bolt) రికార్డుకు 3.24 సెకన్ల దూరంలో ఫినిషింగ్ లైన్ దాటాడు. 2019 ఒలింపిక్స్‌లో బోల్ట్ 9.85 సెకన్లలోనే వంద మీటర్ల పరుగెత్తి రికార్డులు బద్ధలు కొట్టాడు.
‘రికార్డు కోసం హై హీల్స్‌తో పరుగెత్తడం సాధన చేశాను. అయితే.. పరుగు మధ్యలో చాలా అలిసిపోయేవాడిని. వాటితో వేగంగా పరిగెత్తడం సవాల్‌గా అనిపించేది. కానీ, స్పెయిన్‌లో ఇలాంటి పోటీలు నిర్వహిస్తారు. దాంతో, నాకు హై హీల్స్‌తో పరుగెత్తడం ఏమంత కష్టం అనిపించలేదు’ అని క్రిస్టియాన్ తెలిపాడు. అతను ఈ కొత్త రికార్డు ప్రయత్నించడం వెనక ఓ కారణం ఉంది. అదేంటంటే.. అతడికి టైప్ 1 డయాబెటిస్(Type 1 diabetics) ఉంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు మిగతా వాళ్లకంటే చాలా పనులు చేయగలరని చాటి చెప్పడమే తన ఉద్దేశమని క్రిస్టియన్ చెప్పాడు. అతడి హై హీల్స్ పరుగు చూసినవాళ్లంతా ‘వారెవ్వా.. నువ్వు సూపర్ బాస్’ అంటూ క్రిస్టియన్‌ను పొగిడేస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

