ముంబై: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్‌ను నియమించారు. అయితే ద్రావిడ్ నిష్క్రమణతో.. అతని సపోర్టు స్టాఫ్ కూడా మారింది. దీంతో ఇప్పుడు గంభీర్ ఎవర్ని తన సపోర్టు టీమ్‌గా ఎంచుకుంటారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి పారస్ మాంబ్రే తప్పుకోవడంతో.. అతని స్థానంలో వినయ్‌కుమార్‌ను తీసుకోవాలని గంభీర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ బీసీసీఐ నివేదిక ప్రకారం మాత్రం .. బౌలింగ్ కోచ్ రేసులో జహీర్ ఖాన్(Zaheer Khan), లక్ష్మీపతి బాలాజీ ఉన్నట్లు తెలుస్తోంది. వినయ్‌కుమార్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించేందుకు బీసీసీఐ ఆసక్తిగా లేనట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
జహీర్ ఖాన్, బాలాజీల్లో ఎవర్ని ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ ఉన్నది. అయితే జహీర్ ఖాన్ ఇప్పటి వరకు 92 టెస్టుల్లో 311 వికెట్లు తీసుకున్నాడు. భారత జట్టు తరపున అన్ని ఫార్మాట్లలో జహీర్ ఇప్పటి వరకు 610 వికెట్లు తీసుకున్నాడు. ఇక మరో బౌలర్ బాలాజీ.. ఇండియా తరపున కేవలం 8 టెస్టులు మాత్రమే ఆడాడు. వాటిల్లో 27 వికెట్లు తీశాడతను.
గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమించిన విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జే షా తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు. గంభీర్‌పై తనకు పూర్తి నమ్మకం ఉన్నట్లు బీసీసీఐ కార్యదర్శి తెలిపారు.