నార్తాంప్టన్: టీమ్ఇండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కౌంటీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా నార్తాంప్టన్‌షైర్‌కు ఆడుతున్న చాహల్.. డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లు (5/45)తో అదరగొట్టాడు. గత నెలలో కెంట్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ యుజీ ఐదు వికెట్ల (5/14) ప్రదర్శన చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన నార్తాంప్టన్‌షైర్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత చాహల్ స్పిన్ మాయతో డెర్బిషైర్ 165 పరుగులకే ఆలౌట్ అయింది.