Rohit Sharma | ఇటీవల కీలక మ్యాచుల్లో టీమిండియా ఓడిపోతూ అభిమానుల్ని తీవ్ర నిరాశపరుస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మసైతం దూకుడుగా ఆడాల్సిన సమయంలో చేతులెత్తేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్‌కు యువరాజ్‌సింగ్ బాసటగా నిలిచారు. ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ రోహిత్ కెప్టెన్సీపై పోల్ నిర్వహించింది. ఈ పోల్‌లో అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. కాగా, యువరాజ్సింగ్సైతం ఈ పోల్‌లో పాల్గొని రోహిత్ కెప్టెన్సీపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రోహిత్‌కు 10కి-10 మార్కులు వేశారు.
టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టి ఇప్పటికే ఏడాది పూర్తయింది. కోహ్లి తప్పుకున్న తర్వాత జట్టు పగ్గాలు అందుకున్న అతని కెప్టెన్సీలో భారత జట్టు మంచి విజయాలే సాధించింది. అయితే పెద్ద టోర్నీల్లో బోల్తా పడుతుండటం కాస్త ఇబ్బందిగా మారింది. ఇటీవల రోహిత్ నేతృత్వంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ జట్టు విఫలమైంది. కాగా, వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ముందు.. టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం బయటపడటం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు విఫలమైన విషయం తెలిసిందే. ఆల్‌రౌండ్ వైఫల్యంతో పరాజయం పాలైంది. హోరాహోరీగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లా వికెట్ తేడాతో గెలుపొందింది.
10 out of 10
— Yuvraj Singh (@YUVSTRONG12) December 5, 2022