Yuvraj Singh : భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) మైదానంలోకి దిగాడంటే సిక్సర్ల సునామే. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో భారత జట్టు గొప్ప విజయాలు అందించిన యూవీ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ(Member Of Parliament)గా యువరాజ్ సింగ్ పోటీ చేస్తాడని అందరూ చర్చించుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి యూవీ పోటీ చేసే చాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకో తెలుసా..?
తాజాగా యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్‌తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari)ని కలిశాడు. దాంతో, అతడు రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నాడనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. యువరాజ్ మాత్రం ఇంకా స్పందించలేదు. క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం మనదేశంలో కొత్తేమీ కాదు. మాజీ ఆటగాళ్లు గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్లు ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్నారు.
యువరాజ్ సింగ్, స్టువార్ట్ బ్రాడ్
యూవీ విషయానికొస్తే.. గురుదాస్‌పూర నుంచి బాలీవుడ్ ప్రముఖులు సన్నీ డియోల్, వినోద్ ఖన్నాలు ఎంపీగా గెలుపొందారు. యువరాజ్ వాళ్ల లిస్ట్‌లో చేరుతాడా? అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది. భారత జట్టు గొప్ప ఆల్రౌండర్లలో యువరాజ్ సింగ్ ఒకడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ రెండు వరల్డ్ కప్‌లు గెలిచిన భారత జట్టులో సభ్యుడు.
దక్షిణాఫ్రికా గడ్డపై 2007లో జరిగిన టీ20 వరల్డ్కప్లోయూవీ ఓ రేంజ్లో చెలరేగాడు. ఇంగ్లండ్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపి చరిత్ర సృష్టించాడు. అనంతరం 2011లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ యూవీ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో సంచలన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. అంతేకాదు బ్యాటుతో, బంతితో రాణించి ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు.
అయితే..మెడియస్టినల్ సెమినోమా(mediastinal seminoma) అనే అరుదైన క్యాన్సర్ బారిన పడిన యూవీ.. అమెరికాలోని బోస్టన్‌లో కీమోథెరపీ చికిత్స తీసుకున్నాడు. ఆ మహమ్మారి నుంచి 2012లో బయటపడిన అతడు మళ్లీ మైదానంలో ఫ్యాన్స్‌ను అలరించాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్స్‌లో ఆడుతున్న అతడు న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.