న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్లో తొలి శతకం బాదిన బ్యాట్ అంతరిక్షయానం చేసింది. 2003లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో యువీ తొలి సెంచరీ నమోదు చేయగా.. ఆ మ్యాచ్‌లో వాడిని బ్యాట్‌ను ఆసియా నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) మార్కెట్, కొలెక్సియన్ సంస్థ గగనయానం చేయించింది. ఆ సంస్థలతో యువీ చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఎయిర్ బెలూన్ల సహాయంతో బ్యాట్‌ను అంతరిక్షంలోకి పంపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. దీనిపై యువీ స్పందిస్తూ.. ‘నేను తొలి సెంచరీ సాధించిన బ్యాట్ అంతరిక్షంలో విహరించడం ఆనందంగా ఉంది. ఈ ప్లాట్‌ఫాంలో చేరికతో నాకు అభిమానులతో అనుబంధం మరింత పెరుగుతుంది’ అని తెలిపాడు. కొన్ని రోజులుగా అభిమానులను సిక్సర్ కింగ్ యువీ ఊరిస్తూ వచ్చిన సర్ప్రైజ్ ఇదే!