Yuvraj Singh | ‘లార్డ్స్ ఐకానిక్ బెల్’ కొట్టిన యూవీ.. పదో భారత క్రికెటర్‌గా రికార్డు..!
Yuvraj Singh : భారత పురుషుల జట్టు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh)కు మరో గౌరవం లభించింది. ఒకప్పుడు మైదానంలో పరుగుల వరద పారించిన యూవీ.. ఈసారి లార్డ్స్ స్టేడియంలోని 'ఐకానిక్ బెల్' (Lords Iconic Bell)ను మోగించాడు.
Yuvraj Singh : భారత పురుషుల జట్టు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh)కు మరో గౌరవం లభించింది. ఒకప్పుడు మైదానంలో పరుగుల వరద పారించిన యూవీ.. ఈసారి లార్డ్స్ స్టేడియంలోని ‘ఐకానిక్ బెల్’ (Lords Iconic Bell)ను మోగించాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో వన్డేను ఆరంభిస్తూ.. యూవీ ఆ గంట కొట్టాడు. తద్వారా మొత్తంగా ఈ గౌరవం అందుకున్న భారత పదో క్రికెటర్‌గా యువరాజ్ గుర్తింపు సాధించాడు.
ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలోని ఐకానిక్ బెల్కు ఓ ప్రత్యేకత ఉంది. దీన్ని 1884లో జాన్ వార్నర్ అండ్ సన్స్ ఏర్పాటు చేశారు. లార్డ్స్‌లో మ్యాచ్ ఆరంభానికి ముందు.. దిగ్గజ ఆటగాళ్లతో ఆ గంటను మోగించడం 2007 నుంచి ఆనవాయితీగా వస్తోంది. క్రికెట్‌కు విశేష సేవలందించిన ఆటగాళ్లకు ఈ ఐకానిక్ బెల్‌ను మోగించే గౌరవం దక్కుతుంది. ఇదివరకూ భారత ఆటగాళ్లు పది మంది ఐకానిక్ బెల్‌ను కొట్టి మురిసిపోయారు. తొలుత గౌరవం నవాబ్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (Mansur Ali Khan Pataudi)కి లభించింది.
🚨 YUVRAJ SINGH RINGS THE ICONIC LORD’S BELL 🔔🇮🇳
A special honour for an Indian legend.
Yuvraj Singh rang the famous Lord’s Bell ahead of the ODI between India and England.
A proud moment at the Home of Cricket.#YuvrajSingh #Lords #ENGvsIND #TeamIndia…
— Infinite Infos (@infiniteInfos) July 19, 2026
మిథాలీ ఒక్కరే
పటౌడీ అనంతరం సునీల్ గవాస్కర్ 2007లో లార్డ్స్ ఐకానిక్ బెల్‌ను మోగించారు. 2018లో సౌరవ్ గంగూలీ, సంజయ్ మంజ్రేకర్ ఈ గౌరవం అందుకోగా.. 2025లో సచిన్ టెండూల్కర్, ఛతేశ్వర్ పుజారా, మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ (Mithali Raj) లార్డ్స్‌లో గంట కొట్టారు. భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో వన్డే సందర్భంగా యువరాజ్ సింగ్ ఐకానిక్ బెల్‌ను మోగించి తరించాడు.
🔔 A Legendary Moment at the Home of Cricket! ❤️
Yuvraj Singh had the honour of ringing the iconic Five-Minute Bell at Lord’s ahead of the 3rd ODI between India and England. A true legend gracing the Home of Cricket! 🇮🇳🏏#YuvrajSingh #Lords #HomeOfCricket #ENGvIND pic.twitter.com/8n7FDyBIul
— SportsTiger (@The_SportsTiger) July 19, 2026
రెండందల ఏళ్ల చరిత్ర కలిగిన లార్డ్స్‌లో అతడు ఐకానిక్ బెల్ మోగిస్తుండగా భార్య హేజల్ కీచూ సంతోషం పట్టలేకపోయారు. వారం క్రితం వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సమయంలో రాయల్ బాక్స్‌లో తళుక్కుమన్న యువరాజ్.. ఇంగ్లండ్ వేల్స్ బోర్డు, లార్డ్స్ మేనేజర్ ఆహ్వానం మేరకు మూడో వన్డే చూసేందుకు వచ్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

