US Open : భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రీ (Yuki Bhambri) తన కలల ట్రోఫీకి మరింత చేరువయ్యాడు. గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో ప్రతిసారి తడబడే అతడు ఆద్యంతం అదరగొడుతూ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. యూఎస్ ఓపెన్ (US Open)లో సంచలన ఆటతో దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టాడు బాంబ్రీ. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బాంబ్రీ – మైఖేల్ వీనస్ (న్యూజిలాండ్) ద్వయం పదకొండో సీడ్‌కు చెక్ పెట్టింది. తొలి సెట్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకున్న ఈ జోడీ నికొలా మెక్టిక్ – రాజీవ్ రామ్ జంటను చిత్తు చేసింది.
యూఎస్ ఓపెన్‌లో భారత డబుల్స్ ఆటగాడు యుకీ బాంబ్రీ జోడీ సంచలన విజయాలతో దూసుకుపోతోంది. హోరాహోరీగా జరిగిన క్వార్వర్ ఫైనల్లో బాంబ్రీ – వీనస్ ద్వయం అసమాన పోరాటం కనబరిచింది. నికొలా- రజీవ్ జంట తొలి సెట్‌ను 6-3తో కైవసం చేసుకొని షాకిచ్చింది. అయినా సరే ఒత్తిడికి లోనవ్వలేదు బాంబ్రీ జంట.
Yuki Bhambri enters his maiden Grand Slam semi-final along with his New Zealand partner Michael Venus, beating Rajeev Ram and Nikola Mektic with a score of 6-3, 6-7, 6-3 to secure a last 4 spot at the US Open 2025.
Huge congratulations to Yuki on this historic milestone. Wishing… pic.twitter.com/1LkBrtxh11
— SAI Media (@Media_SAI) September 4, 2025
రెండో సెట్లో టాప్‌గేర్ ఆటతో ప్రత్యర్థికి షాకిస్తూ 7-6తో సెట్ గెలుచుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్లోనూ బాంబ్రీ – వీనస్ రెచ్చిపోయారు. పదకొండో సీడ్ జోడీని నిలువరిస్తూ 6-3తో విజయం సాధించారు. దాంతో.. తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు బాంబ్రీ. ఫైనల్ బెర్తు కోసం జరిగే పోరులో బ్రిట్స్ నీల్ స్కప్‌స్కీ, జో సలిస్బరీ జోడీని బాంబ్రీ – వీనస్ జంట ఢీకొననుంది.