ఆక్లాండ్: భారత టెన్నిస్ ఆటగాడు యూకీ బాంబ్రీ, ఫ్రాన్స్ సహచరుడు అల్బనో ఒలివెట్టి ద్వయం ఆక్లాండ్‌లో జరుగుతున్న ఏఎస్‌బీ క్లాసిక్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
గురువారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో ఈ ఇండో, ఫ్రెంచ్ జోడీ.. 3-6, 6-4, 12-10తో బ్రిటన్ జంట జులియన్-లాయిడ్ గ్లాస్పూల్ను ఓడించింది.