అహ్మదాబాద్ : ముంబై యువ క్రికెటర్ ఆయుష్ మాత్రే లిస్ట్ ‘ఏ’ క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ముంబైకి చెందిన 17 ఏండ్ల ఈ కుర్రాడు.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టోర్నీలో అతి పిన్న వయసులోనే 150 ప్లస్ స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 17 ఏండ్ల 168 రోజుల్లోనే ఆయుష్ ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు ప్రస్తుత భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (17 ఏండ్ల 291 రోజులు) పేరిట ఉంది. అయుష్ తన ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు, 15 బౌండరీల సాయంతో 181 పరుగులు చేశాడు.